
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. కొందరు ఈ సినిమాపై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నా.. కలెక్షన్లపై దాని ప్రభావం కనిపించడమ లేదు.
ప్రస్తుతం థియేటర్లలో ఇతర సినిమాలు లేకపోవడం కూడా ఈ సినిమాకి కలిసొస్తోంది. అయితే ఇప్పుడు 'మహర్షి' మేకర్స్ కి పెద్ద షాక్ ఇచ్చింది తమిళ రాకర్స్ వెబ్ సైట్. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే హెచ్ డీ క్వాలిటీ పైరసీ ప్రింట్ ని తమ వెబ్ సైట్ లో రిలీజ్ చేశారు తమిళ రాకర్స్ నిర్వాహకులు.
ఇటీవల కాలంలో విడుదలైన పెద్ద సినిమాలన్నింటినీ కూడా పైరసీ చేసి ఈ వెబ్ సైట్ లో రిలీజ్ చేశారు. ఇప్పటికే చాలా మంది నిర్మాతలు ఈ వెబ్ సైట్ పై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. దీని ఆగడాలను మాత్రం అరికట్టలేకపొతున్నారు.
ఇప్పుడు 'మహర్షి' సినిమాను కూడా లీక్ చేశారు. పైరసీ ఎఫెక్ట్ కచ్చితంగా కలెక్షన్లపై పడుతుందని నిర్మాతల్లో ఆందోళన మొదలైంది. మరి పైరసీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి!