మహానాయకుడు ట్రైలర్.. టెన్షన్ టెన్షన్?

Published : Feb 15, 2019, 07:45 PM ISTUpdated : Feb 15, 2019, 07:52 PM IST
మహానాయకుడు ట్రైలర్.. టెన్షన్ టెన్షన్?

సారాంశం

ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమా రిలీజ్ డేట్ ను వదలి మొత్తానికి అభిమానులకు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.. కానీ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది ఇంకా సందేహంగానే ఉంది. కథానాయకుడు ఇచ్చిన రిజల్ట్ కి అసలు చిత్ర యూనిట్ మొత్తం సైలెంట్ అయిపొయింది.

ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమా రిలీజ్ డేట్ ను వదలి మొత్తానికి అభిమానులకు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.. కానీ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది ఇంకా సందేహంగానే ఉంది. కథానాయకుడు ఇచ్చిన రిజల్ట్ కి అసలు చిత్ర యూనిట్ మొత్తం సైలెంట్ అయిపొయింది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు ముందు నెల రోజులకు ముందే సినిమా ప్రమోషన్స్ తో హంగామా చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు మాత్రం అంతగా బజ్ క్రియేట్ చేయడం లేదు. 

ఫిబ్రవరిబీ 22న మహానాయకుడు సినిమా రిలిజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా అలోచించి ఒక ట్రైలర్ ని అయితే రెడీ చేసుకున్నారు. మొదట మహానాయకుడు కథానాయకుడు ట్రైలర్ ఒకటే అని చెప్పిన చిత్ర యూనిట్ ఇప్పుడు మరో ట్రైలర్ ను కట్ చేసింది. సెకండ్ పార్ట్ లోనే అసలైన కంటెంట్ ఉండడంతో ఓ వర్గం వారికి సినిమాపై అమితమైన ఆసక్తి ఉంది. కానీ బాలకృష్ణ వెన్ను పోటును చూపించగలడా? వైస్రాయ్ ఘటనను ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడు అనే దానిలో అనుమానాలు గట్టిగానే ఉన్నాయి. 

రేపు సాయత్రం కరెక్ట్ గా 5గంటల 55 నిముషాలకు విడుదల చేయబోయే ట్రైలర్ తోనే సినిమా కలెక్షన్స్ ఆధారపడి ఉన్నాయని చెప్పవచ్చు. ఒక్క కాంట్రవర్సీకి టచ్ చేసినా సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ అందుతాయని చెప్పవచ్చు. దర్శకుడు క్రిష్ అసలు కథకు ఎలా ముగింపు పలుకుతాడు అనేది సర్వత్రా ఉత్కంఠను కలిగిస్తోంది. సినిమా భవిష్యత్తు ఏమిటో కాలంతో పాటు ట్రైలర్ కూడా నిర్ణయించే అవకాశం ఉంది.. సో.. చిత్ర యూనిట్ అలాగే బయ్యర్స్ టెన్షన్ లో ఉన్నారనే చెప్పాలి. చూద్దాం.. ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో.. 

PREV
click me!

Recommended Stories

Barabar Premistha Collections: బరాబర్‌ ప్రేమిస్తా మూవీ బాక్సాఫీసు వసూళ్లు.. టీ ఖర్చులు కూడా రాలేదా?
OTT Thrillers: జియో హాట్‌స్టార్ లో అస్సలు మిస్ కాకూడని టాప్ 3 థ్రిల్లర్స్..బుర్రని హీటెక్కించే ట్విస్టులు