మహానటి డిలీటెడ్ సీన్: పెదనాన్నతో సావిత్రి అల్లరి

Published : May 29, 2018, 04:30 PM IST
మహానటి డిలీటెడ్ సీన్: పెదనాన్నతో సావిత్రి అల్లరి

సారాంశం

నిడివి ఎక్కువగా ఉండడంతో 'మహానటి' సినిమాను మూడు గంటలకు కుదించి 

నిడివి ఎక్కువగా ఉండడంతో 'మహానటి' సినిమాను మూడు గంటలకు కుదించి సినిమా విడుదల చేసింది చిత్రబృందం. ఎడిటింగ్ లో చాలా సన్నివేశాలను తీసేశారు. ఇప్పుడు సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే నాలుగు గంటల పటు సినిమా ఉన్నా.. ఆడియన్స్ చూసేలా ఉన్నారు. అయితే అలా ఎడిట్ చేసిన సన్నివేశాలను చిత్రబృందం ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. తాజాగా మరో సీన్ ను విడుదల చేసింది. ఇందులో చౌదరి(రాజేంద్రప్రసాద్).. సావిత్రి(కీర్తి సురేష్)ని తీసుకొని మద్రాస్ వెళ్లడానికి సహాయం చేయమని పెదబాబు గారిని అడగడానికి ఆయన పొలానికి వెళ్తారు. అర నిమిషం గల ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.  

 

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?