నా రెమ్యునరేషన్ ఇంకా ఇవ్వలేదు.. 'మెర్సల్' మెజీషియన్!

Published : Aug 31, 2019, 02:51 PM IST
నా రెమ్యునరేషన్ ఇంకా ఇవ్వలేదు.. 'మెర్సల్' మెజీషియన్!

సారాంశం

‘మెర్సల్‌’ సినిమాకు పనిచేసినందుకుగానూ ఇంతవరకు తన పారితోషికం ఇవ్వలేదని కెనడాకు చెందిన మెజీషియన్‌ రమణ్‌ శర్మ ఆరోపించారు....  

'మెర్సల్' సినిమాకి పని చేసినందుకు తనకు రెమ్యునరేషన్ ఇవ్వలేదని కెనడాకి చెందిన మెజీషియన్ రమణ్ శర్మ ఆరోపణలుచేస్తున్నారు. ఈ విషయాన్ని చట్టపరంగా తేల్చుకుంటానని అన్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ త్రిపాత్రాభినయం చేసిన 'మెర్సల్' సినిమా 2017 అక్టోబర్ లో విడుదలైంది.

అట్లీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా కనిపించారు. ఈ సినిమా దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. కాగా... ఈ సినిమాలో విజయ్  మెజీషియన్ గా కనిపిస్తారు. ఈ క్రమంలో ఆయనకు రమణ్ శర్మ అనే వ్యక్తి శిక్షణ ఇచ్చారు. మేజిక్ ఎలా చేయాలనే విషయంలో ట్రిక్స్ నేర్పించారు. 

అయితే దీనికి సంబంధించి ఇంతవరకు రమణ్ శర్మకి రెమ్యునరేషన్ ఇవ్వలేదట. దీంతో ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. 'మెర్సల్ నిర్మాణ సంస్థ' తనను మోసం చేసిందని.. ఆ సంస్థకు వ్యతిరేకంగా కేసు నమోదు చేయబోతున్నట్లు వెల్లడించారు. చట్టపరంగా ఈ విషయాన్ని తేల్చుకోబోతున్నట్లు చెప్పారు.

దానికోసం కెనడా నుండి ఇండియాకు వచ్చినట్లు చెప్పారు. అంతేకాదు.. 'బిజిల్' సినిమా సెట్ లో విజయ్, అట్లీలను కలిసినట్లు కానీ ఈ వివాదం గురించి వారితో మాట్లాడడం కరెక్ట్  కాదని భావించినట్లు చెప్పారు. మరి దీనిపై 'మెర్సల్' నిర్మాణ సంస్థ తేనందల్ స్టూడియోస్ ఎలా స్పందిస్తుందో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Korean Kanakaraju 13 Days Collections: చతికిల పడ్డ కొరియన్‌ కనకరాజు.. వరుణ్‌ తేజ్‌ మూవీ టోటల్‌ ఎంత చేసిందంటే?
Dil Raju: మహేష్, రాంచరణ్, బన్నీ రిజెక్ట్ చేసిన కథతో సూపర్ హిట్ కొట్టిన హీరో.. వాళ్ళు చేసుంటే సినిమా షెడ్డుకే