దళపతి విజయ్‌కి మద్రాస్‌ హైకోర్ట్ షాక్‌.. రూ. లక్ష జరిమానా

Published : Jul 13, 2021, 03:25 PM IST
దళపతి విజయ్‌కి మద్రాస్‌ హైకోర్ట్ షాక్‌.. రూ. లక్ష జరిమానా

సారాంశం

విదేశాల నుంచి కొనుగోలు చేసుకున్న తన లగ్జరీ కారుకు ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని దళపతి విజయ్ పెట్టుకున్న పిటీషన్‌ని మద్రాస్‌ హైకోర్ట్ కొట్టేసింది.

దళపతి విజయ్‌ కి మద్రాస్‌ హైకోర్ట్ షాక్‌ ఇచ్చింది. లక్ష రూపాయలు జరిమానా విధించింది. ఈ సందర్భంగా రీల్‌ హీరోలపై షాకింగ్‌ కామెంట్స్ చేసింది. మరి ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే.. ఇటీవల ఇంగ్లాండ్‌ నుంచి విజయ్‌ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. అత్యంత ఖరీదైన రోల్స్ రాయ్‌ కారుని ఆయన దిగుమతి చేసుకున్నారు. అయితే ఈ కారుకు సంబంధించిన ట్యాక్స్ ని ఆయన చెల్లించలేదు. పైగా తనకు ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టుకు పిటీషన్‌ దాఖలు చేశారు. 

విజయ్‌ పిటీషన్‌ని మంగళవారం మద్రాస్‌ హైకోర్ట్ కొట్టేసింది. ట్యాక్స్ చెల్లించనందుకు ఆయనకు రూ. లక్ష జరిమానా విధించింది. అందేకాదు రీల్‌ హీరోలు ట్యాక్స్ కట్టేందుకు నిరాకరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక విజయ్‌ కొనుగోలు చేసిన కారు ఖరీదు సుమారు రూ.6 కోట్ల నుంచి 8 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. 

కాగా ప్రస్తుతం విజయ్‌ `బీస్ట్` చిత్రంలో నటిస్తున్నారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. సన్‌ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?
Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్