ఎట్టకేలకు అనుష్క సినిమాపై అనౌన్స్మెంట్!

Published : Nov 08, 2018, 04:17 PM IST
ఎట్టకేలకు అనుష్క సినిమాపై అనౌన్స్మెంట్!

సారాంశం

'భాగమతి' తరువాత అనుష్క నుండి మరో సినిమా ప్రకటన రాలేదు. మధ్యలో దర్శకుడు గౌతమ్ మీనన్ తో సినిమా ఉంటుందనే వార్తలు వినిపించాయి. కానీ దానిపై ఎలాంటి ప్రకటన రాలేదు. గౌతమ్ మీనన్ కూడా తన తమిళ సినిమాతో బిజీ అయిపోయాడు.

'భాగమతి' తరువాత అనుష్క నుండి మరో సినిమా ప్రకటన రాలేదు. మధ్యలో దర్శకుడు గౌతమ్ మీనన్ తో సినిమా ఉంటుందనే వార్తలు వినిపించాయి. కానీ దానిపై ఎలాంటి ప్రకటన రాలేదు. గౌతమ్ మీనన్ కూడా తన తమిళ సినిమాతో బిజీ అయిపోయాడు.

దీంతో అనుష్క తదుపరి సినిమా విషయంలో స్పష్టత లేకుండా పోయింది. ఈరోజు అనుష్క పుట్టినరోజు సందర్భంగా అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పారు ప్రముఖ రచయిత కోన వెంకట్. రచయితగా తన క్రేజ్ తగ్గడంతో నిర్మాణ రంగంలోకి దిగి కాంబినేషన్లు సెట్ చేయడం, సినిమాలకి సమర్పకుడిగా వ్యవహరించడం వంటివి చేస్తూ లాభాల్లో వాటా తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో అతడు మరో కాంబినేషన్ సెట్ చేశాడు. మాధవన్, అనుష్క జంటగా 'వస్తాడు నా రాజు' ఫేం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేశారు. గతంలో మాధవన్, అనుష్క కలిసి 'రెండు' అనే సినిమాలో నటించారు. ఆ తరువాత మళ్లీ కలిసి నటించలేదు.

ఇన్నాళ్లకి ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళబోతుంది. దీనికి కోన సమర్పకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. వచ్చే ఏడాది అమెరికాలో సినిమా షూటింగ్ మొదలుకానున్నట్లు వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Anshula Kapoor Mehendi: పెళ్లి కూతురైన అన్షులా.. మెహందీ వేడుకలో పెద్ది హీరోయిన్ ని చూశారా, వైరల్ ఫోటోస్
Peddi OTT Release: 'పెద్ది' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?