"మా" నూతన అధ్యక్షునిగా శివాజీరాజా

Published : Mar 06, 2017, 03:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
"మా" నూతన అధ్యక్షునిగా శివాజీరాజా

సారాంశం

మా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన శివాజీ రాజా ఇప్పటి వరకు మా ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన శివాజీరాజా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా వేణుమాధవ్, ప్రధాన కార్యదర్శిగా నరేశ్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా నటుడు శివాజీరాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంతవరకు ఆయన 'మా' ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కొత్త కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా హీరో శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా వేణుమాధవ్, ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నటుడు నరేశ్ ఎన్నికయ్యారు.



సినిమా పరిశ్రమ పెద్ద దిక్కుగా ఉన్న దాసరి నారాయణరావు కృషితో ఈసారి పోటీ లేకుండా కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని నరేశ్‌ ఇంతకుముందు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కొత్త కమిటీ అధ్యక్షుడిగా శివాజీరాజా పేరును 'మా' కమిటీ, ఈసీ మెంబర్లు ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. దీనికి 'మా' సభ్యులు, సలహాదారులు అంగీకరించారు. శివాజీరాజా మాట్లాడుతూ ఎన్నికల్లో మేము 10శాతం హామీలిచ్చాం. కానీ కళాకారుల శ్రేయస్సు కోసం 100శాతం కృషి చేశామన్నారు.  



గత ఎన్నికల్లో 'మా' రెండు వర్గాలుగా విడిపోయి పోటీ చేసిన సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్ పై జయసుధ పోటీకి దిగడంతో 'మా' ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. చివరకు రాజేంద్రప్రసాద్ ప్యానల్ విజయం సాధించింది.

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?