మా ఎన్నికల దిశగా అడుగులు.. రంగంలోకి దిగిన కృష్ణంరాజు!

By team teluguFirst Published Jul 27, 2021, 12:46 PM IST
Highlights

ఈ సారి ఎన్నికలు ఏకగ్రీవం చేయాలని మరో వాదన తెరపైకి రాగా, అసలు ఎలక్షన్స్ ఎప్పుడు, ఎలా నిర్వహించాలని అనే పలు విషయాలపై చర్చించడానికి మా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానుంది.

గత రెండు నెలలుగా టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) అధ్యక్ష ఎన్నికలపై వాడి వేడి చర్చ నడుస్తుంది.  సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ దూకుడు ప్రదర్శిస్తూ తాను పోటీలో దిగుతున్నట్లు ప్రకటించడమే కాకుండా, మద్దతుదారులతో మీడియా కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. జయసుధ, సాయి కుమార్, బండ్ల గణేష్, శ్రీకాంత్ వంటి నటులతో కూడిన 27మంది సభ్యుల ప్యానెల్ విడుదల చేశారు. అదే సమయంలో ప్రస్తుత మా అధ్యక్షుడు, కమిటీపై ఆరోణపలు చేయడం జరిగింది. 

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ తో పాటు కమిటీ సభ్యులుగా ఉన్న కరాటే కళ్యాణి, శివ బాలాజీ ఖండించారు. మరోవైపు మంచు విష్ణు ఎన్నికల బరిలో ఉన్నట్లు ప్రకటించారు. ఆయన కూడా కొన్ని హాట్ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అలాగే జీవిత రాజశేఖర్, హేమ , సీవీఎల్ నరసింహా రావు లతో పాటు ఓ కళ్యాణ్ కూడా  ఎన్నికల అధ్యక్ష రేస్ లో ఉన్నట్లు సమాచారం ఉంది. 

ఈ సారి ఎన్నికలు ఏకగ్రీవం చేయాలని మరో వాదన తెరపైకి రాగా, అసలు ఎలక్షన్స్ ఎప్పుడు, ఎలా నిర్వహించాలని అనే పలు విషయాలపై చర్చించడానికి మా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానుంది.మా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) సమావేశం ఈ బుధవారం లేదా గురువారం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలని అనేది నిర్ణయం తీసుకోనున్నారు. థర్డ్ వేవ్ రాకపోతే మా ఎన్నికలు సెప్టెంబర్ లో జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు మా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మీటింగ్ లో నిర్ణయం తీసుకోనున్నారు.


ఈ సమావేశంలో మాలోని సభ్యుల జీవిత బీమాకు చెల్లించాల్సిన ప్రీమియంతో పాటు.. జీవిత సభ్యత్వాలను ఇవ్వటం వంటి అంశాలపై ఈసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.  ఈసీ సభ్యులతో పాటుగా క్రమశిక్షణా సంఘ ఛైర్మన్‌ కృష్ణంరాజు, న్యాయసలహాదారు, ఆడిటర్‌లు కూడా పాల్గొనున్నారు. అయితే ‘మా’ సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత వర్చువల్‌గా ఈసీ మీటింగ్‌ జరగటం ఇదే తొలిసారి.

click me!