వెన్నెలకంటిగారు ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. డబ్బింగ్ సినిమాల అనువాద పాటలే కాదు, స్ట్రెయిట్ సినిమాలకు కూడా వినసొంపైన పాటలు రాసి మెప్పించారు. ఏ రైటర్కైనా ఎక్కువ మంది మెచ్చిన పాటలుంటాయి. ఎక్కువగా పాపులర్ అయిన పాటలుంటాయి. అలా వెన్నెలకంటికి కూడా కొన్ని పాపులర్ పాటలున్నాయి.
వెన్నెలకంటిగారు ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. డబ్బింగ్ సినిమాల అనువాద పాటలే కాదు, స్ట్రెయిట్ సినిమాలకు కూడా వినసొంపైన పాటలు రాసి మెప్పించారు. ఏ రైటర్కైనా ఎక్కువ మంది మెచ్చిన పాటలుంటాయి. ఎక్కువగా పాపులర్ అయిన పాటలుంటాయి. అలా వెన్నెలకంటికి కూడా కొన్ని పాపులర్ పాటలున్నాయి.
1988లో వచ్చిన `మహర్షి` చిత్రంలోని ఆయన రాసిన `మాటరాని మౌనమిది` అనే పాట ఎంతగానో ఆకట్టుకోవడంతోపాటు విశేషంగా శ్రోతకాదరణ పొందింది. దీంతోపాటు `కొంత కలాం కొంతం కాలం కాలమాగిపోవాలి.. నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి.. ` అంటూ సాగే `చంద్రముఖి`లోని ఈ పాట ఎంతగా ఊపిందో తెలిసిందే. అలాగే `అన్నా చెల్లెలు చిత్రంలోని `అందాలు ఆవురవురయ్యాయ` పాట బాగా ఆకట్టుకుంది. ఈ పాట హిట్ కావడంతోనే వెన్నెలకంటి తన ఎస్బీఐ జాబ్కి రిజైన్ చేసిన పూర్తిగా సినిమాల్లోకి వచ్చారు.
వీటితోపాటు `సన్నజాజి పడక.. `(క్షత్రియ పుత్రుడు),`రాసలీల వేళ రాయబామేల.. మాటే మౌనమై మాయజేయనేలా..`(ఆదిత్య 369), `మధురమే సుధాగానం.. మనకిదే మరో ప్రాణం.. మదిలో మోహనగీతం.. మెదిలే తొలి సంగీతం..`(బృందావనం). `నీటిమీద రాతేకాదా ప్రాణమైనా దేహమూ.. ఓటికుండ మోతేలేరా పెంచుకున్న పాశమూ.. ఎవరి కోసమేనాడైనా ఆగబోదు కాలమూ.. `, `చల్తీ కా నామ్ గాడీ..`(చెట్టు కింద ప్లీడరు), `మాటంటే మాటేనంట..`(ఏప్రిల్1 విడుదల), `భీమవరం బుల్లోడా..` (ఘరానా బుల్లోడు), కొండా కోనల్లో లోయల్లో.. `(స్వాతికిరణం), `రావయ్య ముద్దుల మామ.. `(సమరసింహరెడ్డి), `ప్రేమంటే ఏమిటంటే..`(శీను), `హృదయం ఎక్కడున్నది..`(గజిని), వంటి పాటలు విశేషంగా ఆదరణ పొందాయి.
ఆయన రాసిన సినిమాలను ఓ సారి చూస్తే, `మహర్షి`, `చెట్టుకింద ప్లీడరు`, `శ్రీరామచంద్రుడు`, `తేనెటీగ`, `ఏప్రిల్ 1 విడుదల`, `ఆదిత్య 369`, `స్వాతికిరణం`, `అల్లరి ప్రియుడు`, `వన్ బై టూ`, `ముగ్గురు మొనగాళ్లు`, `భైరవద్వీపం`, `శ్రీకృష్ణార్జున విజయం`, `సమరసింహారెడ్డి`, `అన్నయ్య`, `నరసింహనాయుడు`, `టక్కరి దొంగ`, `పట్నాటి బ్రహ్మనాయుడు`, `చంద్రముఖి`, `ఒక్క మగాడు`, `అవారా` వంటి చిత్రాలున్నాయి.