
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకుడు. గురువారం హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదలైంది. ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. 'ఒక లయన్‌కి, టైగర్‌కి పుట్టి ఉంటాడు. క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ' అని రమ్యకృష్ణ చెప్పే డైలాగుతో మొదలైంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండను పూరి జగన్నాథ్ మాసీగా, అదే సమయంలో స్టైలిష్ గా చూపించారు. నేపథ్యంలో వచ్చే సంగీతం బావుంది. విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. సోషల్ మీడియా ఖాతాల్లోనూ లైగర్ పంజా విసురుతోంది. ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్ లలో లైగర్ హవా కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైంది.
అందుతున్న సమాచారం మేరకు కేవలం తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ ని 72 కోట్లుకు అమ్మారని తెలుస్తోంది. ఓ పెద్ద పేరున్న డిస్ట్రిబ్యూటర్ ఈ రైట్స్ తీసుకున్నారని, ఎగ్రిమెంట్ త్వరలో చేసుకోబోతున్నారని వినిపిస్తోంది. ఆ తెలుగు రైట్స్ కూడా కేవలం ఇండియాకే అంటున్నారు. ఇంత రేటు పెట్టి తీసుకుంటున్న ఆ డిస్ట్రిబ్యూటర్ మరెవరో కాదు వరంగల్ శ్రీను అంటున్నారు.
ఈ డీల్ కు సంభందించి కొన్ని టర్మ్ అండ్ కండీషన్స్ తో డిస్కషన్స్ జరుగుతున్నట్లు చెప్తున్నారు. అయితే ఇంత రేటు పెట్టి కొనటం మాత్రం చాలా రిస్కే అంటోంది ట్రేడ్. ఎంతో పెద్ద హిట్ అయితే ఆ స్దాయి రికవరీ ఉండదంటున్నారు. అలాగే టిక్కెట్ రేట్లు బాగా పెంచుతారు అని కూడా అంటున్నారు. అలాగే ఇక ఆంధ్ర, తెలంగాణ, నైజాం ఏరియా లలో హక్కులను డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో లవ్, యాక్షన్, మదర్ రోల్, మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్... పూరి జగన్నాథ్ అన్నీ చూపించబోతున్నారు. ట్రైలర్ లో విజయ్ దేవరకొండకు నత్తి ఉందనే విషయాన్ని కూడా రివీల్ చేశారు. క్యారెక్టర్స్ అన్నీ చూపించారు. కాకపోతే... కథ గురించి క్లూ ఇవ్వలేదు. 'అయామ్ ఫైటర్' అని విజయ్ దేవరకొండ అంటే... 'నువ్వు ఫైటర్ అయితే నేను ఏంటి?' అని మైక్ టైసన్ ట్రైలర్ చివర్లో చెప్పడం బావుంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నది. ఇది డైరెక్టర్ పూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియా చిత్రం.
ముంబై మురికి వీధులలో తిరుగుతున్న ఒక అబ్బాయి ప్రపంచవ్యాప్తంగా బాక్సర్ గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగిందట. విజయ్ దేవరకొండ కూడా ఇందులో ఒక ప్రొఫెషనల్ బాక్సర్గా కనిపించబోతున్నారు. ఇక విజయ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya pandey) నటిస్తున్నది. ఇక ఇందులో రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ చిత్రం ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.