కాలినడకన తిరుమలకు లియో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్!

By Sambi Reddy  |  First Published Oct 12, 2023, 11:38 AM IST

లియో మూవీ విడుదలకు సిద్ధం కాగా లోకేష్ కనకరాజ్ శ్రీవారిని దర్శించుకున్నాడు. తన టీమ్ తో కలిసి ఆయన కాలినడకన మెట్లదారిలో తిరుమలకు వెళ్లారు. 
 



ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాలతో లోకేష్ కనకరాజ్ సౌత్ ఇండియా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యారు. విక్రమ్ ఏకంగా నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కమల్ హాసన్ ని హిట్ ట్రాక్ ఎక్కించిన దర్శకుడిగా లోకేష్ కనకరాజ్ నిలిచారు. దశాబ్దాల అనంతరం కమల్ హాసన్ కి క్లీన్ హిట్ పడింది. విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ కనకరాజ్ నుండి వస్తున్న చిత్రం లియో. విజయ్ హీరోగా నటించగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. లోకేష్ కనకరాజ్ మార్క్ యాక్షన్ సన్నివేశాలతో లియో ట్రైలర్ సాగింది. ట్రైలర్ లో విజయ్ డ్యూయల్ రోల్ చేసినట్లు చూపించారు. లియో కోసం విజయ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ కి జంటగా త్రిష నటిస్తుంది. అర్జున్, సంజయ్ దత్ వంటి స్టార్స్ కీలక రోల్స్ చేశారు. 

Latest Videos

లియో దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ క్రమంలో లోకేష్ కనకరాజ్ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. లోకేష్ కనకరాజ్ మెట్ల దారిలో కాలినడకన తిరుమల చేరుకున్నారు. లోకేష్ తో పాటు ఆయన టీమ్ తిరుమలకు వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లియో మూవీ విజయం సాధించాలని లోకేష్ కనకరాజ్ శ్రీవారిని దర్శించారు. 

కాగా లియో మూవీ 2005లో విడుదలైన హాలీవుడ్ మూవీ ది హిస్టరీ ఆఫ్ వైలెన్స్ కాపీ అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిపై లోకేష్ కనకరాజ్ స్పందించారు. ఆ విషయం లియో మూవీ చూసి మీరే స్వయంగా తెలుసుకోండని క్యూరియాసిటీ పెంచాడు. కాపీ ఆరోపణలు ఆయన ఖండించడం, సమర్థించడం లేదు. ఇది కాపీనా లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమా తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే... 
 

Our and walking to Tirupathi Tirumala for the mega success of 🙏 pic.twitter.com/sXz3p5niTR

— Lets Cinema 🔥 (@VijayVeriyan007)
click me!