బాలీవుడ్ లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ కి అస్వస్థత!

Published : Jun 06, 2021, 01:48 PM IST
బాలీవుడ్ లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ కి అస్వస్థత!

సారాంశం

దిలీప్ కుమార్ గారికి శ్వాస సమస్య ఏర్పడడంతో ఆయనను ఆదివారం ఉదయం హాస్పిటల్ లో జాయ్ చేశాము. వైద్యుల బృందం ఆరోగ్యం పర్యవేక్షిస్తున్నారు. ఆయన కోసం ప్రార్ధనలు చేయండి.. అంటూ మేనేజర్ ట్వీట్ చేశారు.   


బాలీవుడ్ లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. గత రాత్రి ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో కుటుంబ సభ్యులు ముంబై హిందుజా ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈ విషయాన్ని దిలీప్ కుమార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాండిల్ చేస్తున్న ఆయన మేనేజర్ తెలియజేశారు.  దిలీప్ కుమార్ గారికి శ్వాస సమస్య ఏర్పడడంతో ఆయనను ఆదివారం ఉదయం హాస్పిటల్ లో జాయ్ చేశాము. వైద్యుల బృందం ఆరోగ్యం పర్యవేక్షిస్తున్నారు. ఆయన కోసం ప్రార్ధనలు చేయండి.. అంటూ మేనేజర్ ట్వీట్ చేశారు. 


గతంలో కూడా దిలీప్ కుమార్ శ్వాస సంబంధిత ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరడం జరిగింది. ఇక కరోనా వ్యాప్తి నుండి ఆయన, భార్య సైరా భాను క్వారంటైన్ కావడం జరిగింది. కోవిడ్ బారిన పడకుండా ఇంటిలోనే భార్యా భర్తలు విశ్రాంతి తీసుకుంటున్నారు. 


బాలీవుడ్ వెండితెరను ఏలిన మొదటి తరం హీరోలలో దిలీప్ కుమార్ అగ్రగణ్యుడు. వందల సినిమాలలో నటించిన దిలీప్ కుమార్ లెక్కకు మించి అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. ఈ విషయంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారు. కోహినూర్, మొఘల్ ఏ అజమ్, రామ్ ఔర్ శ్యామ్, శక్తి దిలీప్ నటించిన గొప్ప చిత్రాలలో కొన్ని. 1998లో విడుదలైన కిలా ఆయన చివరి చిత్రం.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి