కరోనాకు కర్చీఫ్ తోనూ చెక్: విజయ్ దేవరకొండ చిట్కా

By Surya PrakashFirst Published Apr 7, 2020, 5:14 PM IST
Highlights

ఇన్ని రోజుల తరువాత విజయ్ దేవరకొండ మరలా ట్విట్టర్ లో కనిపించి కొన్ని చిట్కాలు తెలిపారు.  ఎవరూ బయటకు రావొద్దని చెప్తూనే, మెడికల్ మాస్కులను వైద్యులకోసం వదిలేయాలని, ఇంట్లో ఉండే క్లాత్స్ తో ముఖాన్ని కవర్ చేసుకోవాలని ట్విట్టర్ ద్వారా విజయ్ దేవరకొండ తెలిపారు.  


ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉండి అనేక రకాలైన వార్తలు,రూమర్స్ కు ద్వారం తెరిచిన విజయ్ దేవరకొండ ఎట్టకేలకు మౌనం వీడారు.ఇన్ని రోజుల తరువాత విజయ్ దేవరకొండ మరలా ట్విట్టర్ లో కనిపించి కొన్ని చిట్కాలు తెలిపారు.  ఎవరూ బయటకు రావొద్దని చెప్తూనే, మెడికల్ మాస్కులను వైద్యులకోసం వదిలేయాలని, ఇంట్లో ఉండే క్లాత్స్ తో ముఖాన్ని కవర్ చేసుకోవాలని ట్విట్టర్ ద్వారా విజయ్ దేవరకొండ తెలిపారు.  

  vijaydevarkonda

వివరాల్లోకి వెళితే...కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో కూడా కేసులు రోజురోజుకు పెరుగుతూ భయపెడుతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా పై పోరాటంలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు తెలియజేస్తూ వస్తున్నారు. తాజాగా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఇన్ని రోజుల తరువాత విజయ్ దేవరకొండ మరలా ట్విట్టర్ లో  కొన్ని చిట్కాలు తెలిపారు.  

కరోనా మహమ్మారి గురించి పోస్ట్ చేస్తూ.. ‘నా ప్రేమైన మీరందరూ సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాను. వైరస్ నుండి కాపాడుకోవడానికి క్లాత్ తో పేస్ కవర్ చేసుకున్నా చాలు .. వైరస్ తొందరగా వ్యాప్తి చెందదు. అందుకే వైద్యుల కోసం మెడికల్ మాస్క్‌లను వదిలివేయండి. బదులుగా రుమాలు వాడండి. లేదా కండువా ఉపయోగించండి. లేకపోతె అమ్మ చున్నీనైనా వాడండి. ఏదొక దానితో మీ ముఖాన్ని కప్పుకోండి, సురక్షితంగా ఉండండి’ తన ఫోటో తో పోస్ట్ చేశాడు.
 
కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపుతోన్న సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీపై  కూడా కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు, ఫంక్షన్‌లు పూర్తి రద్దవ్వటంతో... సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో భాగంగా సెలబ్రెటీలు ఇంటికే పరిమితమయ్యారు. కొందరు తమకు దొరికిన ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తుండగా.. మరికొందరు తమలోని మరో ప్రతిభను వెలికితీసే పనిలో పడ్డారు. అదే సమయంలో సెలబ్రెటీలు.. కరోనా వైరస్ కల్లోలాన్ని ఎదుర్కోవటానికి తమకు చేతనైన సాయింతో ముందుకు వస్తున్నారు. 
 
 ప్రస్తుతం విజయ్ దేవరకొండ..ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఆ సినిమా కోసం నలభై రోజుల లాంగ్ షెడ్యూల్ ముంబైలో పాల్గొని రీసెంట్ గా వచ్చారు. బాక్సింగ్ క్రీడ చుట్టూ తిరిగే ఈ కథ ..విజయ్ దేవరకొండ కెరీర్ ఓ ప్రత్యేక చిత్రంగా మిగులుతుందని చెప్తున్నారు. అయితే కరోనా దెబ్బతో షూటింగ్ ఆగింది. ఈ వైరస్ విషయం తేలాక మళ్ళీ షూటింగ్ లు మొదలయ్యాక, మిగతా సినిమా పూర్తి చేసి రిలీజ్ చేస్తారు. 
 

click me!