రామోజీరావు కొత్త ఐడియా కేక, కోట్లు లాభం

By Surya PrakashFirst Published Dec 3, 2020, 11:06 AM IST
Highlights

 ఒకే ఒక్క కాంటాక్ట్‌తో ప్రకటనకర్తలు, యాడ్‌ ఏజెన్సీలు సౌత్ లో తమ యాడ్స్ లు ఇచ్చి వినియోగదారులను చేరుకోవచ్చు. అది కూడా అందుబాటు ధరలోనే అనే కొత్త ఆలోచనతో రంగంలోకి దూకారు రామోజీరావు. తన జీవితకాలంలో ఎన్నో బిజినెస్ లు సక్సెస్ చేసిన ఆయన చేస్తున్న కొత్త ఆలోచన ఇది. 

కరోనా ప్రభావంతో చోటు చేసుకున్న పరిణామాలతో మీడియా ప్రకటనల ఆదాయం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. కరోనా తో.. ప్రింట్ మీడియాకు భారీ దెబ్బ పడింది. దాంతో అందరి దృష్టీ డిజిటల్ మీడియాపై పడింది. ఇప్పుడిప్పుడే డిజిటల్ మీడియా మార్కెట్లు భారతదేశంలో బాగా పుంజుకుంటోంది.  2019-20లో దేశవ్యాప్తంగా యాడ్‌ మార్కెట్‌లో 21 శాతం డిజిటల్‌ ద్వారానే సమకూరిందనే చాలా తక్కువ మందికి తెలుసు. డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌కు నానాటికీ ఆదరణ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దక్షిణాది డిజిటల్‌ ఆడియన్స్‌ను చేరుకునేందుకు అడ్వర్టైజర్లు, ఏజెన్సీలకు దక్షిణాదిలో ప్రముఖ పబ్లికేషన్స్‌ కలిసి ఓ  వేదికను ఏర్పాటు చేశాయి. 

ఇప్పటికే వీరంతా విలువైన సమాచారం అందిస్తూ డిజిటల్‌ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్నారు. ఇప్పుడు కన్సార్టియంగా ఏర్పడ్డారు.  ఒకే ఒక్క కాంటాక్ట్‌తో ప్రకటనకర్తలు, యాడ్‌ ఏజెన్సీలు సౌత్ లో తమ యాడ్స్ లు ఇచ్చి వినియోగదారులను చేరుకోవచ్చు. అది కూడా అందుబాటు ధరలోనే అనే కొత్త ఆలోచనతో రంగంలోకి దూకారు రామోజీరావు. తన జీవితకాలంలో ఎన్నో బిజినెస్ లు సక్సెస్ చేసిన ఆయన చేస్తున్న కొత్త ఆలోచన ఇది. 

సౌత్ ఇండియాలో ప్రముఖ వార్తా సంస్థలైన ఈనాడు, దినమలార్‌, మనోరమ ఆన్‌లైన్‌, ప్రజావాణి చేతులు కలిపాయి. దక్షిణ భారతంలోనే అతిపెద్ద, తొలి డిజిటల్‌ యాడ్‌ ప్యాకేజీని ఏర్పాటు చేశాయి. ఇందుకోసం సౌత్‌ ప్రీమియం పబ్లిషర్స్‌ (ఎస్‌పీపీ)ను నెలకొల్పాయి. వాణిజ్య ప్రకటనకర్తలకు డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌లో తోడ్పాటు అందించేందుకు గానూ ఈ నాలుగు ప్రముఖ దినపత్రికలు ఈ వేదికను ఏర్పాటు చేశాయి. దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా ప్రకటనకర్తలు ఒకేసారి పెద్ద ఎత్తున జనాలను చేరుకునే వీలు కలుగుతుంది.

సౌత్‌ ప్రీమియం పబ్లిషర్స్‌ డిజిటల్‌ యాడ్‌ ప్యాకేజీకి చాలా ప్రజాదరణ ఉంది. సుమారు 3.7 కోట్ల యునిక్‌ విజిటర్లు, 71.5 కోట్ల పేజీ వ్యూస్‌, 3.36 నుంచి 8.09 నిమిషాల సరాసరి సగటు వీక్షణలు దీని సొంతం. అంతేకాదు ఎస్‌పీపీ డిజిటల్‌ యాడ్‌ ప్యాకేజీ నెలకు 300 కోట్ల యాడ్‌ ఇంప్రెషన్స్ కలిగి ఉంది. మిగిలిన డిజిటల్‌ ప్యాకేజీతో పోలిస్తే ఎస్‌పీపీ అడ్వర్టైజర్ల సొమ్ముకు పూర్తి విలువను అందిస్తుంది. వారి వ్యాపారాభివృద్ధికి దోహదపడుతుంది. 

ప్రతి డిజిటల్‌ ప్రకటనకర్తా ఈ నాలుగు మీడియా బ్రాండ్ల నుంచి పూర్తి అవగాహనతో పాటు, కావాల్సిన సొల్యూషన్స్  పొందుతారు. అంతేకాదు డిజిటల్‌ న్యూస్‌ను వినియోగించేది ఎక్కువగా యువతే. 18 నుంచి 44 ఏళ్ల వయసు గల ప్రేక్షకులు 73 శాతం మంది ఎస్‌పీపీ సొంతం. డిజిటల్‌ ప్రకటనకర్తలు రోడ్‌ బ్లాక్‌ యాడ్స్‌, డిస్‌ప్లే బ్యానర్‌ యాడ్స్‌, నేటివ్‌ అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా ఈ వేదికను ఉపయోగించుకుని తాము కోరుకున్న వినియోగదారులను చేరుకోవచ్చు అంటున్నారు.

click me!