ఇక పెళ్ళి అవ్వలేదు..కోడలిగా మెగా ఇంట్లో అడుకు పెట్టలేదు.. అటు వదినా మరదళ్ళు మాత్రం తెగ ఫ్రెండ్షిప్ చేసేస్తున్నారు. కలిసి పార్టీలకు తిరుగుతూ.. సందడి చేస్తున్నారు.
ఈమధ్యే మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్లుగా ఎవరికీ తెలియకుండా ప్రేమించుకుంటున్నారు ఈ ఇద్దరు తారలు. అయితే బయటకు తెలియకుండా బాగా మ్యానేజ్ చేశారు వరుణ్ లావణ్య. మధ్య మధ్యలోసోషల్ మీడియాలో ఈ విషయంలో వార్తలు హైలెట్ అయినా సరే.. ఇద్దరు స్పందించకుండా హుందాగా మెయింటేన్ చేశారు. ఇక సడెన్ గా నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపోయారు.
ఇక ఇంకా పెళ్లి పీఠలు ఎక్కలేదు కాని.. లావణ్య మాత్రం.. వరుణ్ తేజ్ ఫ్యామిలీతో బాగా కలిసిపోయింది. మరీ ముఖ్యంగా తన ఆడబిడ్డ నిహారిక తో ఏకంగా స్నేహం చేస్తూ.. కలిసి తిరిగేస్తోంది. వీరిద్దరి మధ్య ఇంతకుముందు నుంచే మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్దరు కలిసి పార్టీలకు కూడా వెళ్తుంటారు. ఇప్పుడు కూడా వీరిద్దరు కలిసి పార్టీలకు తెగ తిరిగేస్తున్నారు.నిశ్చితార్థం తర్వాత మా వదిన అంటూ లావణ్యతో దిగిన ఫోటో షేర్ చేసి స్పెషల్ పోస్ట్ కూడా చేసింది నిహారిక.
తాజాగా వీరిద్దరూ ఓ పార్టీలో కలిసి ఎంజాయ్ చేశారు. ఆ పార్టీలో నిహారిక, లావణ్య కలిసి స్పెషల్ సెల్ఫీలు తీసుకున్నారు. లావణ్య తన ఇన్‌స్టా గ్రామ్ స్టోరీలో సెల్ఫీ షేర్ చేసి ఫేవరేట్ పీపుల్ తో మంచి సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అని పోస్ట్ చేసింది. ఇక నిహారిక పోస్ట్ చేస్తూ లవ్ యు లవ్స్ అంటూ లావణ్య గురించి పోస్ట్ చేసింది. వదిన మరదళ్ళు దిగిన ఈ సెల్ఫీతో మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ ఫోటో ను ఇంకా వైరల్ చేస్తున్నారు. లావణ్య, నిహారిక ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారుగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మంది మాత్రం నిహారిక విడాకుల గురించి ప్రస్తావిస్తూ.. సెటైర్లు విసురుతున్నారు.