‘ఇంటింటికి గన్.. ఎదురులేని ఫన్’.. పబ్బులో బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న లావణ్య త్రిపాఠి..

Published : Jun 07, 2022, 11:54 AM IST
‘ఇంటింటికి గన్.. ఎదురులేని ఫన్’.. పబ్బులో బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న లావణ్య త్రిపాఠి..

సారాంశం

హీరోయిన్ లావణ్య త్రిపాఠి నటిస్తున్న తాజా చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’. ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమైంది. లేటెస్ట్ గా మేకర్స్ చిత్రం నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.   

అందాల రాక్షసి, భలే భలే మొగాడివోయ్ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను  అలరించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి(lavanya tripathi) ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్  ‘హ్యాప్తీ బర్త్ డే’. ఈ చిత్రానికి ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా మేకర్స్ వరుసగా అప్డేట్స్ ను అందిస్తున్నారు. తాజాగా చిత్రం నుంచి పవర్ ఫుల్ టీజర్ ను వదిలారు. సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసేలా ఉందీ టీజర్.

ఇంటింటికి ఆయుధాలు కావాలనే నేపథ్యంలో ‘ఆయుధాల చట్టం’ కోసం మంత్రి (వెన్నెల కిషోర్) పోరాడుతున్న సీన్ తో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆయుధాల ప్రాముఖ్యతను, వాటి అవసరాన్ని తెలియజేసేది సీన్లు సాగుతుంటాయి. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఓ పోష్ పబ్ లో బర్త్ డే పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో జరిగిన కొన్ని ఘటనలో లావణ్య త్రిపాఠి కూడా మిషన్ గన్ తో పబ్ లో బులెట్ల వర్షం కురిపించింది. ఇంతకీ ఇంటింటికి ఆయుధాలు ఎందుకు అవసరం.. ఆ పబ్ లో ఏం జరిగింది.. లావణ్య త్రిపాఠి కూడా అలా ఎందుకు ఫైరింగ్ చేయాల్సి వచ్చిందనే అంశాలను సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.    

నరేష్ ఆగస్త్య, వెన్నెల కిషోర్, సత్య లీడ్ రోల్స్ చేస్తున్నఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్ మూవీని నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. ‘నో గన్, నో ఎంట్రీ’ అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ టీజర్ ఆద్యంతం ఫన్ ను కూడా క్రియేట్ చేస్తోంది. జూలై 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  లావణ్య చివరిగా ‘చావురు కబురు చల్లాగా’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ‘హ్యాపీ బర్త్ డే’తో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌