కపిల్ దేవ్ బయోపిక్.. లేటెస్ట్ అప్డేట్!

Published : Jun 12, 2019, 01:21 PM IST
కపిల్ దేవ్ బయోపిక్.. లేటెస్ట్ అప్డేట్!

సారాంశం

ధోని - సచిన్ - అజారుద్దీన్.. బయోపిక్ ల అనంతరం మరో క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  భజరంగీ భాయీజాన్ - సుల్తాన్ వంటి బాక్స్ ఆఫీస్ సినిమాలను తెరకెక్కించిన కబీర్ ఖాన్ కపిల్ దేవ్ బయోపిక్ కు దర్శకత్వం వహించనున్నాడు.

ధోని - సచిన్ - అజారుద్దీన్.. బయోపిక్ ల అనంతరం మరో క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  భజరంగీ భాయీజాన్ - సుల్తాన్ వంటి బాక్స్ ఆఫీస్ సినిమాలను తెరకెక్కించిన కబీర్ ఖాన్ కపిల్ దేవ్ బయోపిక్ కు దర్శకత్వం వహించనున్నాడు. 83 అనే టైటిల్ ను కూడా సెట్ చేశారు. 

ఇక కపిల్ దేవ్ పాత్రలో నటించడానికి యువ హీరో రణ్ బీర్ కూడా సిద్దమయ్యాడు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. ఈ చారిత్రాత్మక కథలో దీపికా పదుకొనె కూడా నటించనుందని చిత్ర యూనిట్ తెలిపింది. కపిల్ దేవ్ సతీమణి రోమి దేవ్ పాత్రలో దీపిక కనిపించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నిజజీవితంలో భార్య భర్తలైన దీప్ వీర్ మొదటిసారి తెరపై నిజమైన దంపతుల పాత్రలలో కనిపించనున్నారు. 

ఈ సినిమా కోసం గత కొన్ని నెలలుగా హీరో రణ్ వీర్ కపిల్ దేవ్ చుట్టూ తిరుగుతున్నాడు. ఇండియా మొదటి వరల్డ్ కప్ అందుకున్న సమయంలో అలాగే అంతకుముందు కపిల్ ఉన్న పరిస్థితుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. కపిల్ బౌలింగ్ స్టైల్ ని అలాగే బ్యాటింగ్ స్టైల్ ని అలవాటు చేసుకున్నాడట. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి 2020 ఏప్రిల్ 10న సినిమాను విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ ఫిక్సయ్యింది. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : బాంబ్ పేల్చిన దాసు, షాక్ లో శివన్నారాయణ ఫ్యామిలీ, జ్యో రహస్యం బయటపడిందా ?
Gunde Ninda Gudi Gantalu: ఓవైపు శివ, మరోవైపు ప్రభావతి.. బాలు, మీనా కాపురంలో చిచ్చు పెట్టేశారుగా..!