2.0 కలెక్షన్స్: మరోసారి నైజం కింగ్ అనిపించుకున్న శంకర్!

Published : Dec 09, 2018, 10:46 AM ISTUpdated : Dec 09, 2018, 10:49 AM IST
2.0 కలెక్షన్స్: మరోసారి నైజం కింగ్ అనిపించుకున్న శంకర్!

సారాంశం

గత నెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 2.0 చిత్రం మొత్తానికి 500 కోట్ల క్లబ్ లో చేరింది. రజినీకాంత్ - అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించగా లైకా ప్రొడక్షన్స్ దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది. 

గత నెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 2.0 చిత్రం మొత్తానికి 500 కోట్ల క్లబ్ లో చేరింది. రజినీకాంత్ - అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించగా లైకా ప్రొడక్షన్స్ దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది. అయితే ఈ సినిమా ఎక్కువగా హిందీలో అధిక వసూళ్లను అందుకుంటోంది.  

ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే హాలిడేస్ టైమ్ లో ఎక్కువ కలెక్షన్స్ ను రాబట్టడానికి ప్రయత్నం చేస్తోంది. నైజాంలో శంకర్ సినిమాలకు మంచి మార్కెట్ ఉందని మరోసారి రుజువయ్యింది. రీసెంట్ గా సినిమా నైజం ఏరియాలో 19 కోట్ల షేర్ కలెక్షన్స్ తో న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది. 20 కోట్లను అందుకోవడానికి సినిమాకు ఎక్కువ సమయం పట్టదు.  

అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలంటే సినిమా ఈ వీక్ లో కూడా మంచి కలెక్షన్స్ ను రాబట్టాలి. సినిమా 3డి స్క్రీన్స్ లలో సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకోగా 2డిలో  అంతగా పాజిటివ్ టాక్ ను తెచ్చుకోలేకపోయింది. మరి ఈ వీక్ లో సినిమా ఎంతవరకు షేర్స్ ను అందుకుంటుందో చూడాలి.       

PREV
click me!

Recommended Stories

Highest Remuneration: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్ల పారితోషికాలు.. అత్యధికంగా తీసుకునేది ఎవరంటే?
బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్