సలార్ లేటెస్ట్ అప్డేట్... రాజ మనార్ వస్తున్నాడు

Published : Aug 22, 2021, 12:27 PM IST
సలార్ లేటెస్ట్ అప్డేట్... రాజ మనార్ వస్తున్నాడు

సారాంశం

సలార్ లో రాజ మనార్ రోల్ చేయనున్న నటుడుని రేపు పరిచయం చేయనున్నారు. మరి ఈ రాజ మనార్ హీరో సలార్ కి శత్రువా లేక మిత్రుడా అనేది తెలియాల్సి ఉంది. 

ప్రభాస్ ప్రకటించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో సలార్ ఒకటి కాగా, ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. కెజిఎఫ్ మూవీతో దేశాన్ని మెస్మరైజ్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ లాంటి మాస్ హీరో చేస్తున్న చిత్రం కావడంతో, హైప్ ఆకాశానికి చేరింది. షూటింగ్ జరుపుకుంటున్న సలార్ మూవీపై చిత్ర యూనిట్ లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. సలార్ మూవీలోని కీలకమైన రాజ మనార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ రేపు ఉదయం 10:30 నిమిషాలకు రానుంది. 


సలార్ లో రాజ మనార్ రోల్ చేయనున్న నటుడుని రేపు పరిచయం చేయనున్నారు. మరి ఈ రాజ మనార్ హీరో సలార్ కి శత్రువా లేక మిత్రుడా అనేది తెలియాల్సి ఉంది. ప్రభాస్ మిగతా చిత్రాలతో పోల్చితే సలార్ నుండి వరుస అప్డేట్స్ రావడం ఫ్యాన్స్ ని సంతృప్తి పరుస్తున్న అంశం. కెజిఎఫ్ మేకర్స్ హోమబుల్ ఫిల్మ్స్ సలార్ చిత్రానికి నిర్మాతలుగా ఉన్న విషయం తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సలార్ చిత్రంలో  శృతి హాసన్ ప్రభాస్ కి జంటగా నటిస్తున్నారు. 2022 సమ్మర్ కానుకగా సలార్ విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా సలార్ పలు బాషలలో విడుదల కానుంది. 

మరోవైపు సలార్ తో పాటు ఆదిపురుష్, రాధే శ్యామ్ చిత్రాల షూటింగ్స్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రకటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రాజెక్ట్ కే, ఇటీవల లాంఛ్ అయిన విషయం తెలిసిందే. 2022లో ప్రభాస్ నుండి రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. ఆదిపురుష్ సైతం అదే ఏడాది విడుదలయ్యే సూచనలు కలవు. 

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి