Silk Smitha Biopic : సిల్క్ స్మిత మరో బయోపిక్.. వైరల్ గా మారిన ఫస్ట్ లుక్.. హీరోయిన్ ఎవరంటే?

Published : Dec 02, 2023, 05:41 PM ISTUpdated : Dec 02, 2023, 05:45 PM IST
Silk Smitha Biopic : సిల్క్ స్మిత మరో బయోపిక్.. వైరల్ గా మారిన ఫస్ట్ లుక్.. హీరోయిన్ ఎవరంటే?

సారాంశం

దివంగత సిల్క్ స్మిత జయంతి నేడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కు సూపర్ అప్డేట్ అందింది. ఆమె మరో బయోపిక్ నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. నెట్టింట వైరల్ గా మారింది. హీరోయిన్ కూడా అచ్చం సిల్క్ లానే ఉండటం ఆసక్తికరంగా మారింది.  

స్కిల్ స్మిత (Silk Smitha) పేరు తెలియని వారంటూ ఉండరు. 1980లో డాన్సర్ గా ఆమె ఓ తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. తన అందచందాలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బడా హీరోలతో కలిసి వెండితెరపై మెరిసి సంచలనాలు సృష్టించింది. ఈరోజు సిల్క్ స్మిత జయంతి కావడం విశేషం. 1960 డిసెంబర్ 2న ఆమె జన్మించారు. నేడు ఆమె 63వ పుట్టినరోజు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆమె గుర్తు చేసుకుంటున్నారు. 

ఈ క్రమంలో అభిమానులకు సూపర్ అప్డేట్ అందింది. ఇప్పటికే స్కిల్ స్మిత జీవితంపై బాలీవుడ్ లో ‘డర్టీ పిక్చర్’ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. విద్యా బాలన్ ఆమె పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం మరో బయోపిక్ కూడా రూపుదిద్దుకుంటోంది. నూతన దర్శకుడు జయరామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. Silk Smitha The Untold Story టైటిల్ తో నిర్మిస్తున్నారు. ఈరోజు ఆమె జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ప్రస్తుతం పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. 

పోస్టర్ ను సిల్క్ స్మిత బెస్ట్ స్టిల్ ను అనుకరిస్తూ విడుదల చేశారు.  అయితే, అచ్చం సిల్క్ స్మితలానే ఉన్న హీరోయిన్ ఆకట్టుకుంటోంది. ముఖంలో హావభావాలను పలికిస్తున్న తీరుకు సెన్సేషన్ కానుందని తెలుస్తోంది. ఆ హీరోయిన్ పేరు చంద్రికా రవి (Chandrika Ravi). ఇండియన్ ఆస్ట్రేలియన్ యాక్ట్రెస్. గతంలో పలు తమిళ చిత్రాల్లో నటించారు. బాలకృష్ణ నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘వీరసింహా రెడ్డి’లోని ఓ పాటలో మెరిశారు. ప్రస్తుతం మూవీ షూటింగ్ దశలోనే ఉంది. చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

PREV
click me!

Recommended Stories

Tamanna Regret: ప్రభాస్‌ని రిజెక్ట్ చేసి తప్పు చేసిన తమన్నా.. ఎప్పుడూ బాధపడేది ఈ విషయంలోనే
Vishnu Priya: హాట్ గా ఉండటం నా తప్పా? చూసే చూపులోనే ఉంటుంది..విష్ణుప్రియ కామెంట్స్..!