Lata Mangeshkar Pass Away: లతా మంగేష్కర్ అసలు పేరు ఏంటీ..? లతా గా ఎలా మారారు..?

Published : Feb 06, 2022, 02:23 PM IST
Lata Mangeshkar Pass Away: లతా మంగేష్కర్ అసలు పేరు ఏంటీ..? లతా గా ఎలా మారారు..?

సారాంశం

సంగీతాప్రపంచాన్ని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు లతా మంగేష్కర్. దాదాపు 60 ఏళ్లకు పైగా పాటల ప్రపంచాన్ని ఏలిన మహారాణి  లతా మంగేష్కర్. అయితే లతాజీ అసలు పేరు మత్రం ఇది కాదు.మరి ఆమె అసలు పేరేంటి..?

సంగీతాప్రపంచాన్ని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు లతా మంగేష్కర్. దాదాపు 60 ఏళ్లకు పైగా పాటల ప్రపంచాన్ని ఏలిన మహారాణి  లతా మంగేష్కర్. అయితే లతాజీ అసలు పేరు మత్రం ఇది కాదు.మరి ఆమె అసలు పేరేంటి..?

లతా మంగేష్కర్.. ఈ పేరు తెలియనివారు దాదాపు ఉండరు. పాటలతో అందరి నోళ్లల్లో నానిన పేరది. కాని పాటల పూదోట లతాజీ అసలు పేరు మాత్రం అదికాదు. మరి ఆమె అసలు పేరు ఏంటంటే  హేమ మంగేష్కర్.  అసలు పేరుకు తగ్గట్టు ఆమె మనసు కూడా బంగారమే. మరి, అసలు పేరు కాకుండా.. కొసరుపేరుతోనే ఆమె ఎందుకంత ఫేమస్ అయ్యారో తెలుసా?

లతాజీ  తండ్రి దీనానాథ్ మంగేష్కర్ గొప్పగాయకుడు, రంగస్థల కళాకారుడు ఆయన  స్వయాన గాయకుడు కావడం, రంగస్థల నాటకరంగంలో ఉండడంతో.. లతాఈ కూడా ఆయనతో పాటు వెళ్ళేవారట.లతాజీ తండ్రి దీనానాద్  భవబంధన్ అనే నాటకాన్ని రాశారు. ఆ నాటకంలోని మెయిన్  పాత్ర పేరు లతిక. అయితే ఆ పాత్ర తనకు ఎంతో నచ్చడంతో అప్పటిదాకా హేమ గా ఉన్న ఆమె తన పేరును,లతగా మార్చుకున్నారు లెజండరీ సింగర్.

లతా మంగేష్కర్ చాలా అవమానాలు ఎదుర్కోన్నారు. ఆమె స్కూల్ కు వెళ్లి తోటి విద్యార్థులకు పాటలు నేర్పుతుండడంతో.. టీచర్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసేవారు. అసలు స్కూల్ కు రావొద్దంటూ ముఖం మీదనే చెప్పేశారట టీచర్లు. దీంతో ఆమె స్కూలుకు వెళ్లడం మానేశారంటేనే ఆమెకు పాటలంటే ఎంత మక్కువో అర్థం చేసుకోవచ్చు. అయితే, తన చెల్లెలు ఆశా భోంస్లేని కూడా స్కూలుకు రానివ్వకపోవడం వల్లే తాను స్కూలు మానేశానని ఓ ఇంటర్వ్యూలో  లతాజీ చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?
Avatar 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్లు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అవతార్‌ 3 సంచలనం.. బాక్సాఫీసు వద్ద డీలా