లక్ష్మీస్ ఎన్టీఆర్: ఇంకా ఎన్ని రోజులు వర్మ?

Published : Jan 21, 2019, 09:27 PM IST
లక్ష్మీస్ ఎన్టీఆర్: ఇంకా ఎన్ని రోజులు వర్మ?

సారాంశం

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫొటోలతో పాటలతో లక్ష్మీస్ ఎన్టీఆర్ పై అంచనాలు భారీగా పెంచుతున్నాడు. రీసెంట్ గా సినిమాలోని ప్రధాన పాత్రల ఫోటోలను రిలీజ్ చేసిన వర్మ మరో రెండు పోటోలను రిలీజ్ చేసి ఆసక్తిని రేపాడు. 

మొదటి ఫొటోలో ఎన్టీఆర్ దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు ఉండగా ఆయనతోనే ఇంట్లో ఒక చోట లక్ష్మి పార్వతి నిలబడి ఎన్టీఆర్ ను చూస్తున్నారు. ఇక మరో ఫొటోలో ఎన్టీఆర్ ఇంట్లో తెలుగు దేశం పార్టీ నాయకులూ అంతా కలిసి భోజనం చేస్తున్నట్లు వర్మ చూపించాడు. సినిమాలో రాజకీయ కోణాల్ని చాలా వరకు వర్మ టచ్ చేశాడని ఈ ఫొటోతో చెప్పకనే చెప్పేశాడు.

అయితే చాలా వరకు నెటిజన్స్ వర్మపై ప్రశంసలు కురిపిస్తుంటే ఓ వర్గం వారు విమర్శలు కూడా చేస్తున్నారు. ఎన్ని రోజులు ఈ ఫొటోలతో పబ్లిసిటీ చేసుకుంటావ్ సినిమాను త్వరగా రిలీజ్ చేయండి అంటూ వర్మపై కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అసలైన జీవిత చరిత్ర తానే చూపించబోతున్నట్లు వర్మ చెబుతున్నాడు. మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.  

PREV
click me!

Recommended Stories

Newtons 3rd Law Movie Review: న్యూటన్స్ థర్డ్ లా మూవీ రివ్యూ, సుమంత్‌ చెప్పిన కర్మ థియరీ ఎలా ఉందంటే?
Venkatesh Family Movies: వెంకటేష్ కెరీర్ లో టాప్ 6 ఫ్యామిలీ మూవీస్.. వీటిల్ని కొట్టే సినిమాలు ఉన్నాయా?