'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ చూశారా..?

By Udaya DFirst Published Feb 14, 2019, 9:48 AM IST
Highlights

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ట్రైలర్ మొత్తం 'వెన్నుపోటు' ఎపిసోడ్ నే చూపించారు వర్మ. 

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ట్రైలర్ మొత్తం 'వెన్నుపోటు' ఎపిసోడ్ నే చూపించారు వర్మ. ''రామ రామ రామ'' అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ట్రైలర్ మొదలైంది. 

లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ని కలవడానికి రావడం.. 'జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుందో.. ఎవరికీ అర్ధం కాదు..' అంటూ ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతితో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.  
''ఈవిడ పేరు లక్ష్మీ పార్వతి నా జీవిత చరిత్ర రాస్తున్నారు..'' అంటూ లక్ష్మీపార్వతిని తన పార్టీ సభ్యులకు పరిచయం చేసే సన్నివేశాలను చూపించారు. 

''దానికిగాని కొడుకు పుడితే మీ ఫ్యామిలీ ఫినిష్'' అంటూ చంద్రబాబు.. ఎన్టీఆర్ ఫ్యామిలీతో అనడం.. వెంటనే ఆ ఇంటి ఆడపిల్ల లక్ష్మీపార్వతిని కొడుతూ బూతులు తిట్టడం చూపించారు. 

''ఈ వయసులో కూడా మీకు ఆడతోడు అవసరమంటే..'' అంటూ హరికృష్ణ.. ఎన్టీఆర్ ని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే దానికి ఎన్టీఆర్ సీరియస్ అవ్వడం చూపించారు. 

''తమ్ముళ్లూ వాడి మాట వినకండి..'' అంటూ ఎన్టీఆర్.. చంద్రబాబుని ఉద్దేశిస్తూ పార్టీ సభ్యులకు చెబితే వారు మాత్రం ఎన్టీఆర్ పై చెప్పులు విసరడం వంటి సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. 

చివరగా ఎన్టీఆర్.. ''నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు.. వాడిని నేను నమ్మడం'' అంటూ చంద్రబాబుని ఉద్దేశించి చెప్పిన డైలాగ్స్ హైలైట్ గా నిలిచింది. 

click me!