'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఫస్ట్ డే కలెక్షన్స్!

By Udaya DFirst Published Mar 30, 2019, 12:43 PM IST
Highlights

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏపీలో మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది.

ఎన్టీఆర్ జీవిత చరిత్రని లక్ష్మీపార్వతి కోణంలో వెండితెరపై చూపించాడు వర్మ. ఈ సినిమా ఓ వర్గపు ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటుంటే  కొందరు మాత్రం ఈ సినిమాను విమర్శిస్తున్నారు.

ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికొస్తే.. సుమారు సుమారు 550 థియేటర్స్‌లో విడుదల చేసేందుకు ప్రయత్నించగా.. చివర్లో హైకోర్ట్ స్టేతో నైజాంలో 250 థియేటర్స్‌లో మాత్రమే విడుదల చేశారు. దీంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడింది.

అమెరికాలో 125 స్క్రీన్స్ పై భారీగా విడుదలైన ఈ సినిమా మొదటిరోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఒక్క ప్రీమియర్ షోల ద్వారా 90,214 డాలర్లను రాబట్టింది. ఇక ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో శుక్రవారం జోరు మరింత పెరిగింది. గురు, శుక్రవారాలను కలుపుకొని 145,928 డాలర్ల ఓపెనింగ్స్ రాబట్టింది. 

click me!