‘డాన్స్ ఐకాన్’ షోకు జడ్జిగా లేడీ సూపర్ స్టార్..‘ఆహా’లో అడుగుపెడుతున్న రమ్య కృష్ణన్..

By team telugu  |  First Published Sep 12, 2022, 4:18 PM IST

ప్రముఖ సీనియర్ నటి, లేడీ సూపర్ స్టార్ రమ్య కృష్ణన్ (Ramya Krishnan) ఓటీటీ ప్లాట్ ఫాం‘ఆహా’లో అడుగుపెట్టబోతోంది. ‘డాన్స్ ఐకాన్’షో ద్వారా ఆడియెన్స్ ను అలరించబోతోంది. 
 


లేడీ సూపర్ స్టార్ రమ్య కృష్ణన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో నటిస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు టీవీ షోకూ జడ్జీగా, గెస్ట్ అపియరెన్స్ తో హాజరవుతూ టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఓటీటీ ప్లాఫామ్ లోనూ ఆడియెన్స్ ను అలరించేందుుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’(Aha)లో అడుగుపెట్టబోతోంది. ‘ఆహా’ ఎప్పుడు విన్నూత్నంగా ఉండే కథలని, షోస్ ని వారి అభిమానులకు ఇవ్వడానికి పరితపిస్తుంది. 

‘తెలుగు ఇండియన్ ఐడల్’ సింగింగ్  రియాలిటీ షో సక్సెస్ తర్వాత మరోసారి నాన్-ఫిక్షన్ లో తన సత్తాచాటుకోవడానికి ‘డాన్స్ ఐకాన్’ (Dance Ikon)తో సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ ని ఈ షో కి బ్రాండ్ అంబాసిడర్ లా ఆహ్వానించారు. ఇప్పుడు అందరిని ఉర్రూతలూగించడానికి లేడీ సూపర్ స్టార్ రమ్య కృష్ణన్ ను జడ్జ్ గా పరిచయం చేయబోతున్నారు. ఈ షో ద్వారా రమ్య కృష్ణన్ ఓటీటీ ప్లాట్ ఫామ్లో జడ్జ్ గా అడుగుపెడుతున్నారు. కింగ్ ఆఫ్ హుక్ స్టెప్స్ శేఖర్ మాస్టర్ డిజిటల్ స్పేస్ లో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా రమ్య కృష్ణన్ పరిచయం అవుతున్నారు. 

Latest Videos

టెలివిజన్ టాప్ యాంకర్, ప్రొడ్యూసర్ ఓంకార్ ఈ షోతో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 11న ‘ఆహా’లో ప్రీమియర్ అయింది. అలాగే  సెప్టెంబర్ 17 నుండి ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. మరోవైపు రమ్య కృష్ణన్ ఎప్పటి నుంచో తమిళం, తెలుగు టెలివిజన్ షోస్ లో మెరుస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. రీసెంట్ గా ‘బీబీ జోడిగల్ 2’కు జడ్జీగా వ్యహరించింది. ప్రస్తుతం ‘డాన్స్ ఐకాన్’ షోతో తెలుగు టెలివిజన్ ఆడియెన్స్ ను అలరించబోతోంది.

 

click me!