టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ..  పాన్ ఇండియా మూవీతో అల్లు అర్హ వెండితెర ఎంట్రీ..!

Published : Jul 15, 2021, 02:25 PM IST
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ..  పాన్ ఇండియా మూవీతో అల్లు అర్హ వెండితెర ఎంట్రీ..!

సారాంశం

కొద్దిరోజులుగా అల్లు అర్హ ఓ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు గుణశేఖర్ నేడు దీనిపై స్పష్టత ఇచ్చాడు. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలం లో అర్హ నటిస్తున్నట్లు తెలియజేశారు. 

అల్లు అర్జున్ గారాల తనయ అల్లు అర్హ వెండితెర ఎంట్రీకి రంగం సిద్ధమైంది. అర్హ ఏకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో నటించనున్నారు. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన వెలువడింది. కొద్దిరోజులుగా అల్లు అర్హ ఓ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు గుణశేఖర్ నేడు దీనిపై స్పష్టత ఇచ్చాడు. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలం లో అర్హ నటిస్తున్నట్లు తెలియజేశారు. 


కథలో కీలకమైన భరతుడు అనే రాజు  కూతురుగా అర్హ చేయనుంది. అర్హ చేస్తుంది సమంత చిన్ననాటి పాత్ర కూడా కావచ్చు. అల్లు రామలింగయ్య నటవారసత్వంలోని నాలుగవ తరానికి చెందిన అర్హ వెండితెర అరంగేట్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అల్లు అర్హ చాలా క్యూట్ అండ్ యాక్టీవ్. ఇంటి దగ్గర ఖాళీ సమయం దొరికితే అర్హతో ఆడుకుంటూ వీడియోలు చేయడం అల్లు అర్జున్ కి మహా సరదా. అల్లు అర్హ క్యూట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. 


లిటిల్ ప్రిన్సెస్ గా శాకుంతలం మూవీలో అర్హ అల్లరి ఎలా ఉంటుందో చూడాలి. ఇక శాకుంతలం మూవీ షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది.  హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మల్టీ లింగ్వల్ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం