ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? కృష్ణం రాజు ఫన్నీ రిప్లై

Surya Prakash   | Asianet News
Published : Jan 21, 2021, 03:25 PM IST
ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? కృష్ణం రాజు ఫన్నీ రిప్లై

సారాంశం

సీనియర్ నటుడు కృష్ణంరాజుకు విసుగెచ్చేసినట్లుంది. ఆయన్ను మీడియా వారు కలిసినప్పుడల్లా మీ అబ్బాయి ప్రబాస్ పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. మాగ్జిమం ఆయన అలాంటి ప్రశ్నలను ఎంటర్టైన్ చేయటం లేదు. అయితే తాజాగా మరోసారి ఇదే ప్రశ్న ఆయనకు లైవ్ ఎదురైంది. అయితే ఈ సారి మాత్రం ఫన్నిగా రిప్లై ఇచ్చారు. అయితే అది ఫన్నీ కాదని, నిరుత్సాహంతో అన్నమాట అని కొందరంటున్నారు. ఇంతకీ కృష్ణం రాజుగారు ఏమన్నారో చూద్దాం. 

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్  అంటే అది ప్రభాస్ పెళ్లి అనే చెప్పాలి. టాలీవుడ్  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనేది అభిమానులకు ఎప్పుడూ ఆసక్తరమైన విషయమే. అందుకే మీడియాని కలిసినప్పుడు ప్రభాస్ కు అయినా, కృష్ణం రాజుకు అయినా ఇదే ప్రశ్న ఎదురు అవుతుంది.

 తాజాగా కృష్ణంరాజు 81వ పుట్టినరోజు సందర్భంగా ఓ న్యూస్ ఛానె లైవ్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలను ఆడియన్స్ తో పంచుకున్నారు. రాధేశ్యామ్ సినిమాలో తను నటిస్తున్న పాత్ర గురించి ఆయన కొన్ని కీలక విషయాలు కూడా ప్రేక్షకులతో  పంచుకున్నారు. తన పాత్రకు గడ్డం అవసరం కావడంతో గడ్డం మెయింటేన్ చేస్తున్నానని అని చెప్పుకొచ్చారు.

అయితే చిట్ చాట్ లో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని అడగగా ఆయన కాస్త సీరియస్ అయ్యారు. వెంటనే తడుము కోకుండా అయినప్పుడు చూద్దాం అంటూ సమాధానం చెప్పేశారు. వెంటనే కాస్త షాక్ అయిన యాంకర్ అలా కాదు ఆయన పెళ్లి కోసం ఆయన ఫ్యాన్స్ అందరూ బాగా  ఎదురు చూస్తున్నారు కదా అంటూ అడగగా అవునని,ప్రభాస్ పెళ్లి కోసం తాను కూడా ఎదురు చూస్తున్నానని కానీ అది ఎప్పుడు అంటే  తాను చెప్పలేనని అని చెప్పుకొచ్చారు. అవనీయండి అయినప్పుడే చూద్దామని ఆయన తేల్చి చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి