శ్రీ శ్రీ రాసిన ప్రతి అక్షరానికి పారితోషికం ఇచ్చిన సూపర్‌ స్టార్‌ కృష్ణ.. మహాకవి నోట్‌ వైరల్‌

Published : Nov 16, 2022, 03:24 PM IST
శ్రీ శ్రీ రాసిన ప్రతి అక్షరానికి పారితోషికం ఇచ్చిన సూపర్‌ స్టార్‌ కృష్ణ.. మహాకవి నోట్‌ వైరల్‌

సారాంశం

సాహిత్యాన్ని కూడా Krishna ఎంతో గౌరవించేవారు. ప్రత్యేకంగా చూసుకునేవారు. అలా మహాకవి శ్రీశ్రీతోనూ ఆయనకు ఎంతో గొప్ప అనుబంధం ఉంది. ఆ విషయాన్ని శ్రీశ్రీ వెల్లడించడం విశేషం. 

సూపర్‌ స్టార్‌, నటశేఖరుడు కృష్ణ ఘట్టమనేని(SuperStar Krishna) వ్యక్తిగా ఎంత మంచి వారో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తన నిర్మాణ సంస్థ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఘనత కృష్ణ. పనిలేని వారికి పని కల్పించేందుకు తన నిర్మాణ సంస్థలను ఉపయోగించడం విశేషం. అయితే సాహిత్యాన్ని కూడా ఆయన ఎంతో గౌరవించేవారు. ప్రత్యేకంగా చూసుకునేవారు. అలా మహాకవి శ్రీశ్రీ(Sri Sri)తోనూ ఆయనకు ఎంతో గొప్ప అనుబంధం ఉంది. ఆ విషయాన్ని శ్రీశ్రీ వెల్లడించడం విశేషం. అంతేకాదు ఆయన రాసిన ప్రతి అక్షరానికి విలువ కట్టి పారితోషికం అందించిన ఘనత కూడా కృష్ణకే చెందుతుంది. 

1970లో కృష్ణ పద్మాలయ పిక్చర్స్ ని స్థాపంచించారు. నిర్మించిన తొలి చిత్రం `అగ్నిపరీక్ష`. ఈ చిత్రంలో మహాకవి శ్రీ శ్రీ చేత పాటలు రాయించారు కృష్ణ. ఈ చిత్రంతో మొదలు అనేక చిత్రాలకు శ్రీ శ్రీతో పాటలు రాయించడం విశేషం. ఎన్నో విధాలుగా శ్రీ శ్రీని ఆదుకున్నారట. తనకు నచ్చిన పాటకి మరింత పారితోషికం అందించేవారట. ఎలాంటి బాకీ లేకున్నా అడ్వాన్సులు ఇచ్చేవారట. శ్రీ శ్రీకి సంబంధించిన ప్రతి ప్రయాణానికి పద్మాలయ స్టూడియో వారే అడ్వాన్స్ టికెట్‌ బుకింగ్‌ లు చేయించేవారని శ్రీ శ్రీ సాహిత్యనిధి కన్వినర్‌ తెలిపారు. 

అంతేకాదే ఏకంగా శ్రీ శ్రీనే కృష్ణ గురించి ఈ విషయాలను తెలిపారట. `నేను ఒక అక్షరం రాసినా దానికి కూడా విలువ కట్టి పారితోషికం ఇచ్చిన ఏకైకా వ్యక్తి కృష్ణ. సినీ ఫీల్డ్ నా మీద ప్రత్యేకాభిమానం ఉన్న అనేకులలో ముఖ్యుడు కృష్ణ. ఆయన్ని ఆత్మీయుడిగా పరిగణిస్తాను` అని స్వయంగా శ్రీశ్రీనే పేర్కొనడం విశేషం. శ్రీశ్రీ తెలియజేసినట్టుగా ఓ సుప్రభాతం అనే పత్రిక 1994లో ఏప్రిల్‌ 5న ప్రచురించింది. ప్రస్తుతం ఆ పేపర్ క్లిప్‌ వైరల్‌ అవుతుంది.

 వీరి కలయికలో అనేక విప్లవాత్మక పాటలు, జనాన్ని తట్టిలేపే పాటలు వచ్చాయి. వాటిలో `అల్లూరి సీతారామరాజు` చిత్రంలో `తెలుగు వీర లేవరా..` అనే సాయుధ పోరాట దేశ భక్తి ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఇది తెలుగు ప్రజలను ఉర్రూతలూగించింది. అంతేకాదు ఈ పాటకి తొలిసారి జాతీయ అవార్డు దక్కింది. తొలి జాతీయ అవార్డుని అందుకున్న పాటగా నిలిచింది. తొలి జాతీయ అవార్డు అందుకున్న రచయితగా శ్రీశ్రీ నిలవడం విశేషం. ఈ సందర్భంగా సంస్థ గౌరవ ప్రతిష్ఠలు మరింత పెంచినందుకు హీరో కృష్ణ పద్మాలయా సంస్థద్వారా శ్రీశ్రీకి మరోమారు పారితోషకాన్ని అందించి గౌరవించారట.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్