Khiladi : రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్.. అందుకే డైరెక్టర్ కి కారు గిఫ్ట్, ఖిలాడీలో ఆ సీన్స్ పై నిర్మాత

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 08, 2022, 10:48 AM IST
Khiladi : రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్.. అందుకే డైరెక్టర్ కి కారు గిఫ్ట్, ఖిలాడీలో ఆ సీన్స్ పై నిర్మాత

సారాంశం

ఖిలాడీ మూవీ యూత్ కి ఫీస్ట్ లా అనిపిస్తోంది. ఇటీవల విడుదలైన సాంగ్స్, తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.  

మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడీ. ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. దీనితో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో రవితేజకి జోడిగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. 

ఇటీవల విడుదలైన సాంగ్స్, తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు, యూత్ కి ఈ మూవీ ఫీస్ట్ లా అనిపిస్తోంది. డింపుల్ హయతి, మీనాక్షి ఇద్దరూ రెచ్చిపోయి అందాలు ఆరబోస్తున్నారు. ట్రైలర్ లిప్ లాక్ సీన్స్ కూడా చూపించారు. అలాగే ఇద్దరు హీరోయిన్లు బికినిలో కనిపిస్తున్నారు. దీనితో రవితేజ నుంచి వస్తున్న ఫుల్ మాస్ మసాలా చిత్రం ఖిలాడీ అని చెప్పేయొచ్చు. 

తాజాగా ఈ చిత్ర నిర్మాత కోనేరు సత్యనారాయణ ఖిలాడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖిలాడీ చిత్రం విడుదల కాకముందే ఆయన దర్శకుడు రమేష్ వర్మకి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. ఖిలాడీ రషెస్ చూశాను. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అందుకే దర్శకుడికి కారు గిఫ్ట్ గా ఇచ్చా. ఇటలీలో తెరకెక్కించిన సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్ లో అబ్బురపరుస్తాయి అని సత్యనారాయణ అన్నారు. 

ఫిబ్రవరి 11న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఏపీలో 4 ఆటలకు ఇప్పటికే అనుమతి అడిగాం. ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది అని సత్యనారాయణ అన్నారు. తనకు విద్యాసంస్థలు, వ్యాపారాలు ఉన్నప్పటికీ తన కొడుకు హవీష్ కోసం సినిమా రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలిపారు. రాక్షసుడు 2 తో పాటు.. పాన్ ఇండియా చిత్రాలకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు సత్యనారాయణ పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే