విషాదంః `మహాభారత్‌`లోని భీముడి పాత్రధారి కన్నుమూత..

Published : Feb 08, 2022, 09:54 AM IST
విషాదంః `మహాభారత్‌`లోని భీముడి పాత్రధారి కన్నుమూత..

సారాంశం

 బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. `మహాభారత్‌`లోని భీముడి పాత్ర పోషించి ప్రవీణ్‌ కుమార్‌ సోబ్లీ (75) కన్నుమూశారు.

బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ప్రవీణ్‌ కుమార్‌ సోబ్తీ(75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె నికునిక వెల్లడించారు. ఆయన సోమవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూసినట్టు తెలిపింది. దీంతో హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. బీఆర్‌ చోప్రా రూపొందించిన `మహాభారత్‌`లోని భీముడి పాత్ర పోషించి ప్రవీణ్‌ కుమార్‌ సోబ్లీ పాపులర్‌ అయ్యారు. తాజాగా ఆయన మృతి పట్ల బాలీవుడ్‌ సినీ, టీవీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 

దాదాపు రెండు దశాబ్దాల పాటు హిందీ చిత్ర పరిశ్రమలో యాక్టీవ్‌గా ఉన్న ప్రవీణ్‌ కుమార్‌ సోబ్తీ దాదాపు యాభైకి పైగా హిందీ చిత్రాల్లో నటించారు. పలు టీవీ సీరియల్స్ లోనూ నటించి మెప్పించారు. అందులో భాగంగా బీఆర్‌ చోప్రా రూపొందించిన టీవీ సీరిస్‌ `మహాభారత్‌` మంచి గుర్తింపు తెచ్చింది. ఇందులో భీముడి పాత్రకి ప్రాణం పోశారు ప్రవీణ్‌ కుమార్‌. 

ఇక `రక్ష` చిత్రంతో హిందీ పరిశ్రమలోకి నటుడిగా అడుగుపెట్టిన ఆయన `ఘజాబ్‌`, `హమ్‌ సే హై జమానా`, `హమ్‌ హై లజవాబ్‌`, `జగీర్‌`, `యుద్ద్‌`, `జబర్దస్త్`, `మహాశక్తిమాన్‌`, `సింగాసన్‌`, `అధికార్`, `నామ్‌ ఓ నిషాన్‌`, `లోహా`, `హుకుమత్‌`, `షేహన్షా`, `కమాండో`, `మహబ్బత్‌ కే దుష్మన్‌`, `అగ్నీ`, `ప్యార్‌ మహబ్బత్‌`, `సంతోష్‌`, `ఇలాకా`, `మిట్టి ఔర్‌ సోనా`, `ఇలాన్‌ ఈజంగ్‌`, `ఘయల్‌`, `ఆజ్‌ కా అర్జున్‌`, `కాలి గంగా` వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రవీణ్‌ కుమార్‌ సోబ్తీ తెలుగులోనూ ఓ సినిమా చేశారు. `కిష్కిందా కాండ` చిత్రంలో ట్రక్‌ డ్రైవర్‌గా నటించి మెప్పించారు. 

ఆయన నటుడి మాత్రమే కాదు, స్పోర్ట్స్ ఛాంపియన్‌ కూడా. ఇండియన్‌ హమ్మర్‌, డిస్కస్‌ థ్రోవర్‌. వీటితోపాటు రాజకీయాల్లోనూ యాక్టీవ్‌గా ఉన్నారు. మరోవైపు బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్ లో జవాన్‌గానూ పనిచేశారు. 20ఏళ్లప్పుడు ఆర్మీలో జాయిన్‌ అయి సరిహద్దు కపాలా గా ఉన్నారు. అయితే ఆ సమయంలో ప్రవీణ్‌ కుమార్‌లోని క్రీడాలక్షణాలను గమనించి ఆర్మీ అధికారి ఆ దిశగా ఎంకరేజ్‌ చేశారు.

 డిస్కస్‌ థ్రోలో ఏషియన్‌ గేమ్స్ లో పాల్గొన్నారు. అందులో ఆయన రెండు గోల్డ్ మెడల్స్, కామెన్వెల్త్ గేమ్స్ లో సిల్వర్‌ మెడల్‌ని అందుకున్నారు. అంతేకాదు ఒలంపిక్స్ లోనూ పాల్గొన్నారు. ఇలా అనేక మెడల్స్ ని సాధించారు ప్రవీణ్‌ కుమార్‌ సోబ్తీ. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. యాభైకిపైగా చిత్రాల్లో అద్భుతమైన నటనతో మెప్పించారు. అట్నుంచి 2013లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. కానీ రెండు సార్లు ఓడిపోయారు. ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా