చరణ్ - చిరు.. స్టోరీ సిద్ధమవుతోంది!

Published : Jan 11, 2019, 06:41 PM IST
చరణ్ - చిరు.. స్టోరీ సిద్ధమవుతోంది!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే తెరపై ఫుల్ మూవీలో కనిపిస్తే ఆ  కిక్కే వేరు. మెగా తనయుడు రామ్ చరణ్ కూడా మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇకపోతే సీనియర్ రైటర్ కోన వెంకట్ ఈ కాంబినేషన్ పై ఓ క్లారిటీ అయితే ఇచ్చాడు. 

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే తెరపై ఫుల్ మూవీలో కనిపిస్తే ఆ  కిక్కే వేరు. మెగా తనయుడు రామ్ చరణ్ కూడా మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇకపోతే సీనియర్ రైటర్ కోన వెంకట్ ఈ కాంబినేషన్ పై ఓ క్లారిటీ అయితే ఇచ్చాడు. ప్రస్తుతం కోన అనుష్కతో ఒక థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నారు. 

ఇక కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకున్న కోన మెగా హీరోలతో వర్క్ చేయడానికి కూడా సిద్దమవుతున్నట్లు చెప్పాడు. రీసెంట్ గా ట్విట్టర్ లో  చాట్ చేసిన కోన ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చాలానే ఇచ్చాడు. అందులో భాగంగా మెగా మల్టీస్టారర్ ఆలోచన ఏమైనా ఉందా అని అడిగిన ఓ నెటిజన్ కు కోన ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. 

ప్రస్తుతం కథని ఫినిష్ చేసే పనిలో ఉన్నట్లు చెబుతూ అన్ని కుదిరితే సెట్స్ పైకి త్వరలోనే ఆ కాంబినేషన్ రావచ్చన్నట్లు స్పందించారు. దీంతో మెగా అభిమానులు ఆ కథను తొందరగా ఫినిష్ చేయండి సార్ అంటూ పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఇక త్వరలోనే అనుష్కతో చేయబోయే సినిమాకు సంబందించిన టైటిల్ ను ప్రకటించనున్నట్లు కోన వెంకట్ పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Double Elimination: బిగ్‌ బాస్‌ తెలుగు 9 డబుల్‌ ఎలిమినేషన్‌, 14వ వారం ఈ ఇద్దరు ఔట్‌.. టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే
Nagababu: సౌత్ ఆఫ్రికా నుంచి ఫోన్ చేసిన స్టార్ హీరో.. నాగబాబు, భరణి ఇద్దరి సమస్య ఒక్కటే.. అందుకే ఈ బంధం