నెగెటివ్ రివ్యూలు ఇస్తే లీగల్ యాక్షన్.. ఇదెక్కడి రూల్..?

By AN TeluguFirst Published Jul 9, 2019, 3:55 PM IST
Highlights

కోలీవుడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ పేరుతో వచ్చిన ఓ ప్రెస్ నోట్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది.

కోలీవుడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ పేరుతో వచ్చిన ఓ ప్రెస్ నోట్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. ఇకపై సినిమా రివ్యూలు రాసేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని.. సినిమాను దుయ్యబడుతూ, తీవ్రంగా విమర్శిస్తూ ఎవరైనా అభిప్రాయాలు చెబితే వాళ్ల మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని  ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.

అంతేకాదు.. ఇకపై సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ జరిగినా అందులో మీడియా ప్రతినిధులకు కేవలం టీ మాత్రమే అందిస్తామని భోజనాలు ఇతర వసతులు ఉండవని కూడా చెప్పారు. ఇప్పుడు ఈ విషయం మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

సినిమాలు బాగా తీసి ప్రేక్షకుల మెప్పు పొందడంపై దృష్టి పెట్టడంమానేసి రివ్యూలు రాసేవారి మీద పడటం ఏంటని చర్చలు నడుస్తున్నాయి. రివ్యూలు తేడాగా రాస్తే సినిమా ఈవెంట్ లకు ఆహ్వానాలు అందించమని చెప్పడం మరో విషయం. ఏ సినిమాప్రమోషన్స్ లోనైనా మీడియా కీలక పాత్ర పోషిస్తుంది.

మీడియా  కారణంగానే సినిమా జనాల వరకు వెళ్తుంది.. అలాంటిది మీడియాకి ఆంక్షలు విధించడం ఏంటి..? నిజంగానే సినిమా బాగుండి రివ్యూలు నెగెటివ్ గా రాసినా.. ప్రేక్షకులు మోసపోయే సీన్ ఉండదు. నిర్మాతలు ఒక సినిమా తీసి దాన్ని జనాల్లోకి వదిలి.. అభిప్రాయం చెప్పకూడదంటే ఎలా..? అసలు ఇలాంటి బెదిరింపుల ద్వారా కోలీవుడ్ నిర్మాతలు ఏం చెప్పాలనుకుంటున్నారు..? 
 

click me!