శంకర్@25.. దర్శకుల కోలాహలం!

By Prashanth MFirst Published Apr 22, 2019, 8:19 PM IST
Highlights

యూనివర్సల్ పాయింట్ తీసుకొని అన్ని బాషల వారిని ఆకర్షించేలా మంచి సందేశాత్మక చిత్రాలను బారి బడ్జెట్ తో  తెరకెక్కించడంలో ఈ దర్శకుడి శైలి వేరు. అన్ని తరహాల కథలను తెరపై అద్భుతంగా చూపించిన శంకర్ సినీ ప్రస్థానం 25ఏళ్ళకు చేరుకుంది. 

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై 100 కోట్ల బడ్జెట్ సినిమాలు ఎంతవరకు నిలవగలవు అనే సందేహానికి మొదటి సమాధానం శంకర్. యూనివర్సల్ పాయింట్ తీసుకొని అన్ని బాషల వారిని ఆకర్షించేలా మంచి సందేశాత్మక చిత్రాలను బారి బడ్జెట్ తో  తెరకెక్కించడంలో ఈ దర్శకుడి శైలి వేరు. అన్ని తరహాల కథలను తెరపై అద్భుతంగా చూపించిన శంకర్ సినీ ప్రస్థానం 25ఏళ్ళకు చేరుకుంది. 

ఈ సందర్బంగా ఆయన శిష్యులు ఒక చోట చేరి శంకర్ కి మంచి ట్రీట్ ఇచ్చారు. ఇక వారితో పాటు మణిరత్నం - గౌతమ్ మీనన్ - లింగుసామి వంటి దర్శకులు కూడా ఈవెంట్ లో సందడి చేశారు. అందులో భాగంగా ఒక మంచి సెల్ఫీ దిగి దర్శకదిగ్గజాలు అభిమానులకు ఈ విధంగా మంచి ట్రీట్ ఇచ్చారు. 

తమిళనాడులో అప్పట్లో ఎక్కడో మారుమూలన పడి ఉన్న కోయం బత్తుర్ నుంచి చెన్నై నగరానికి శంకర్ నటుడవ్వాలని వచ్చాడు. రెండు మూడు సినిమాల్లో వేషాలు కూడా వేశాడు. ఇక దర్శకుడవ్వాలని చంద్రశేఖర్(హీరో విజయ్ తండ్రి) వద్ద శిష్యరికం చేశాడు. అనంతరం జెంటిల్ మెన్ సినిమాతో కోలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

తెలుగు జనాలు కూడా ఆ సినిమాతో శంకర్ మరింత దగ్గరయ్యారు. భారతీయుడు - జీన్స్ -ఒకే ఒక్కడు - బాయ్స్ - అపరిచితుడు - శివాజీ - రోబో - 2.0 సినిమాలతో ప్రపంచాన్ని ఆకర్షించాడు. ఇక అప్పుడపుడు తన శిష్యులను డైరెక్టర్స్ గా మర్చి తానే నిర్మాతగా మారి అవకాశాలు ఇచ్చాడు. అట్లీ - బాలాజీ - శక్తివేల్ - వసంత బాలన్ ఆయన శిష్యులే. 

click me!