గజ తుఫాను బాధితులకు కోలీవుడ్ అండ.. ఎవరెంత ఇచ్చారంటే?

Published : Nov 21, 2018, 02:36 PM IST
గజ తుఫాను బాధితులకు కోలీవుడ్ అండ.. ఎవరెంత ఇచ్చారంటే?

సారాంశం

తమిళనాడులో గత కొన్ని రోజులుగా గజ తుఫాను బీభత్సం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా కోట్లల్లో ఆసక్తి నష్టం వాటిల్లింది. ఎక్కువగా తమిళ రైతులు ఈ గజ తుఫాను కారణంగా నష్టపోయారు. 

తమిళనాడులో గత కొన్ని రోజులుగా గజ తుఫాను బీభత్సం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా కోట్లల్లో ఆసక్తి నష్టం వాటిల్లింది. ఎక్కువగా తమిళ రైతులు ఈ గజ తుఫాను కారణంగా నష్టపోయారు. అయితే వారికి తమిళ సినీ పరిశ్రమ అండగా ఉంటోంది. కోలీవుడ్ స్టార్ హీరోలు ప్రమాదం జరిగితే ఆదుకోవడానికి ఎప్పుడైనా ముందుటారు. 

రజినీకాంత్ - కమల్ హాసన్ వారి పార్టీల తరపున విరాళాలు సేకరించి 50 లక్షల రూపాయలకు పైగా సహాయాన్ని అందించినట్లు సమాచారం. ఇక స్టార్ హీరో విజయ్ కూడా తన వెల్ఫేర్ క్లబ్ ద్వారా జనాలు నుంచి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాడు. ఇక సూర్య - కార్తీ ఫ్యామిలీ 50 లక్షలు అందించగా విక్రమ్ 25 లక్షలను ఇచ్చాడు. శివ కార్తికేయన్ 10 లక్షలు - విజయ్ సేతుపతి 25 లక్షలు ఇచ్చి వారి ఉదారతను చాటుకున్నారు. 

ఇక 2.0 టీమ్ తరపున లైకా ప్రొడక్షన్స్ వారు 1.01 కోట్ల సహాయానిధిని ప్రకటించగా దర్శకుడు శంకర్ తనవంతు సహాయంగా 10 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. రెహమాన్ ఒక ఈవెంట్ ద్వారా వచ్చే డబ్బును గజ తుఫాను బాధితులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇతర నటీనటులు రచయితలు టెక్నీషియన్స్ వారి శక్తి మేరకు సహాయం చేస్తూ తమిళనాడు వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?