కిరణ్ అబ్బవరం "వినరో భాగ్యము విష్ణుకథ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే?

Published : Oct 30, 2022, 04:40 PM IST
కిరణ్ అబ్బవరం  "వినరో భాగ్యము విష్ణుకథ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే?

సారాంశం

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం  బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రిలీజ్ చేస్తూ దూసుకుపోతున్నారు. తదుపరి చిత్రం  ‘వినరో భాగ్యము విష్ణు కథ’తో  థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా  అవుతున్నారు. ఈ మేరకు రిలీజ్ డేట్ ను ప్రకటించారు. 

`రాజావారు రాణిగారు`, `ఎస్‌. ఆర్‌ కళ్యాణమండపం` చిత్రాలతో యంగ్ అండ్ డైనమిక్ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  ఆ తర్వాత వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే మూడు చిత్రాలు విడుదలై పాజిటివ్ టాక్ ను అందుకున్నాయి. ఇందులో `సెబాస్టియన్‌`, `సమ్మతమే` చిత్రాలు ఏడాది మొదట్లో రిలీజ్ కాగా.. గతనెల 16 (సెప్టెంబర్ 16)న `నేను మీకు బాగా కావాల్సినవాడిని` చిత్రంతో ఆకట్టుకున్నాడు. తాజాగా మరోచిత్రంతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్దంగా ఉన్నారు. 

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న మరో చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’(Vinaro Bhagyamu Vishnu Katha). కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మురళీ కిషోర్‌ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఎగ్జైటింగ్ అప్డైట్స్ ను అందిస్తూ వస్తున్నారు. 

ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, గ్లింప్స్ కు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. తాజాగా సినిమా రిలీజ్  డేట్ ను ఫైనల్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న రిలీజ్ కు సిద్ధం చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విలేజ్‌ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత బన్నీవాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు.   చిత్రానికి చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూర్చుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

అజిత్‌ పై హీరోయిన్ క్రష్.. నువ్వు నా చెల్లివి అని షాకిచ్చిన హీరో, ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?
Gaayapadda Simham Movie Review: గాయపడ్డ సింహం రివ్యూ, తరుణ్ భాస్కర్ కు ట్రంప్ అంటే ఎందుకంత కోపం?