కమెడియన్ కిర్రాక్ ఆర్పీ (Kirrak RP) బిజినెస్ పరంగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశాడు. తాజాగా మ్యారేజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశాడు.
‘జబర్దస్త్’ ద్వారా టీవీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు కమెడియన్ కిర్రాక్ ఆర్పీ (Kirrak RP). బుల్లితెరపై తనదైన పంచులు, స్కిట్లతో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇక కొన్నేండ్లుగా జబర్దస్త్ కు దూరమైన ఆర్పీ ప్రస్తుతం బిజినెస్ లో అడుగుపెట్టాడు. కేవలం ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ (Nellore Pedda Reddy) కర్రీ పాయింట్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆర్పీ పేరు నగరంలో ప్రస్తుతం మార్మోగుతోంది.
ఇదిలా ఉంటే.. అమీర్ పేట్ లోని థర్డ్ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా ఆర్పీ తన పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. గతేడాది మేలో ఆర్పీకి లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయితో నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక పెళ్లి ఎప్పుడనే సందేహం అందరిలో ఉండగా.. తాజాగా దానిపై క్లారిటీ ఇచ్చారు. ‘నాకు అబద్దాలు చెప్పడం రాదు. ఆమె వెంట రెండేండ్లు పిచ్చికుక్కలా తిరిగాను. వాళ్ల తల్లిదండ్రులను ఒప్పుకున్నారు. నవంబర్ 29న పెళ్లి చేసుకోబోతున్నామని’ చెప్పారు.
ఆర్పీ చేసుకోబోయే అమ్మాయి లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ.. తమ లవ్ స్టోరీని రివీల్ చేసింది. తను ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్ లో ఉన్నప్పుడు ఆర్పీ గెస్ట్ గా వచ్చారంట. అక్కడ పరిచయం ఏర్పడింది. తర్వాత ఆమె తల్లిగారి నెంబర్ తీసుకొని ఇంట్లో వాళ్లకు దగ్గరయ్యాడు. చుట్టాలకూ బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఆమె పేరెంట్స్ తో పెళ్లికి ఒప్పించాడని’ చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీకి ఆర్పీ ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. ఏదేమైనా ఆర్పీ ఈ ఏడాది పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాబోతున్నారు.
తొలుత కేపీహెచ్ బీలో ప్రారంభించిన నెల్లూరు చేపల పులుసును కర్రీ పాయింట్ ను.. రెండో బ్రాంచ్ గా మణికొండలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా అమీర్ పేటలో నూ మరో బ్రాంచ్ ను ఓపెన్ చేశారు. ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి సీనియర్ నటుడు శ్రీకాంత్ మరియు దర్శకుడు మారుతీ హాజరై ప్రారంభించారు. ఆర్పీ అండ్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కిర్రాక్ ఆర్పీ కర్రీపాయింట్ ను ప్రారంభించడం పట్ల బుల్లితెర నటీనటులు, సెలబ్రెటీలు ఆ బ్రాంచ్ లకు విజిట్ చేస్తూ ఆర్పీకి సపోర్ట్ చేస్తున్నారు. దీంతో బాగా పబ్లిసిటీ వచ్చింది.