గన్ను కావాలి... గర్ల్ ఫ్రెండు కావాలి, మీడియా ప్రశ్నకి కింగ్ నాగార్జున ఫన్నీ ఆన్సర్

By Mahesh JujjuriFirst Published Oct 1, 2022, 9:07 AM IST
Highlights

అరవై ఏళ్లు దాటి వయసు ఉరుకులు పెడుతున్నా.. కింగ్ నాగార్జునలో మన్మథుడు ఇంకా అలానే ఉన్నాడు. ఆ విషయాన్ని తాజాగా మరోసారి నిరూపించాడు స్టార్ సీనియర్ హీరో. 
 

ఇప్పటికీ టాలీవుడ్ మన్మథుడు అంటే  కింగ్ నాగార్జునానే. ఆయనకుఎంత వయస్సు వచ్చినా.. ఆయన మనస్సుకి, గ్లామర్ కు మాత్రం వయస్సు రాదు. ఈ విషయాన్ని ప్రస్తుతం నిరూపిస్తున్నారు నాగ్. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో రచ్చ రచ్చ చేస్తున్నారు కింగ్ నాగార్జున.  ఇక కింగ్ నాగార్జున తాజాగా నటించిన  సినిమా ది ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. 

ఈ మూవీ ప్రమోషన్స్  లో  నాగార్జున ఫుల్ బిజీగా ఉన్నారు. సూపర్ ఫాస్ట్ గా మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రీసెంట్ గా స్పెషల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు టీమ్. ఈ వెంట్ లో నాగార్జునకు ఆసక్తికర ప్రశ్న ఎదురయ్యింది. ఆయన రొమాంటిక్  ఇమేజ్ గురించి ప్రశ్నించారు ఓ మీడియా ప్రతినిధి. దానికి కింగ్ నాగార్జున నవ్వుతూ ఫన్నీఆన్సర్ కూడా ఇచ్చారు.  

 

. funny reply to media question 😂🤣 pic.twitter.com/UNX8gPP0aC

— Rajesh Manne (@rajeshmanne1)

 

ది ఘోస్ట్ మూవీ ఈవెంట్ లో మీడియా ప్రతినిథి ప్రశ్నిస్తూ.. మీరు ఆన్ స్క్రీన్ లో  అమ్మాయిలతో రొమాన్స్ బాగా చేస్తారు కదా.. మరి మీకు అమ్మాయిలతో రొమాన్స్ చేయడం బాగా ఇష్టమా..  గన్స్ తో ఫైరింగ్ చేయడం ఇష్టమా అని అడిగారు. దానికి పెద్దగా నవ్విన నాగార్జున మళ్ళీ ఒక సారి ప్రశ్న రిపిటీ చేయాలని కోరారు. మరోసారి అడగ్గా.. నవ్వుతూ.. ఒక చేతిలో అమ్మాయి.. మరో చేతిలో గన్ను ఉండటం అంటే ఇష్టం అని నాటీ ఆన్సర్ ఇచ్చారు కింగ్. 

ఈ సమాధానంతో అక్కడ అందరూ అరుపులు కేకలతో  సందడి చేశారు. ఇలా ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అనేక ప్రశ్నలు అడిగారు. రకరకాల ప్రశ్నలు అడగ్గా.. వాటికి ఓపికగా సమాధానం చెప్పారు కింగ్ నాగార్జున. ఇక ది ఘోస్ట్ సినిమా రిలీజ్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీలో ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నాగార్జున నటించారు. చాలా కాలం తరువాత డిఫరెంట్ క్యారెక్టర్ లో నాగార్జున నటించారు. ఇక  నాగార్జున సరసన హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ అలరించనుంది. 

click me!