
కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'నా సామిరంగ'. చాలా కాలంగా నాగార్జున నుంచి స్టైలిష్, సాఫ్ట్ చిత్రాలు మాత్రమే వస్తున్నాయి. ఎట్టకేలకు నాగార్జున తన లోపల దాగున్న మాస్ కోణాన్ని బయటకి తీసేలా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన నా సామిరంగ ఫస్ట్ లుక్ గ్లింప్స్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.
సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే సన్నాహకాలు జరుగుతున్నాయి. అయితే ఇంకా కంఫర్మ్ కాలేదని సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా నా సామిరంగ టీజర్ రిలీజ్ చేశారు. టైటిల్ కి తగ్గట్లుగానే కింగ్ నాగార్జున నా సామిరంగ అనిపిస్తునాడు. టీజర్ ఆద్యంతం మాస్ అండ్ ఎంటర్టైనింగ్ అంశాలతో అదిరిపోయింది. ఒక నిమిషం 45 సెకండ్ల నిడివి ఉన్న టీజర్ లో నాగార్జున ఫుల్ ఫ్లోలో రెచ్చిపోతున్నాడు.
హీరోయిన్ ఆషిక రంగనాథ్ కూడా పల్లెటూరి యువతిలా అదుర్స్ అనిపించింది. అల్లరి నరేష్ నాగార్జున పాత్రకి ఎలివేషన్ ఇస్తూ కనిపిస్తున్నాడు. నాగార్జున నుంచి ఈ తరహా మాస్ ఫైట్స్ చూసి చాలా కాలమే అయింది అని చెప్పొచ్చు. ఆడేమైనా కుర్రాడనుకుంటున్నాడా.. కొంచెం తగ్గమను అంటూ ఆషిక చెబుతున్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
నాగార్జున, ఆషిక మధ్య రొమాన్స్ కూడానా బాగా కుదిరింది. 8 ఏళ్లకు ముందు ఎదో జరిగింది అన్నట్లుగా టీజర్ లో ఫ్లాష్ బ్యాక్ గురించి హింట్స్ ఇచ్చారు. నాగార్జున, ఆషిక లుక్స్ లో కూడా వేరియషన్స్ కనిపిస్తున్నాయి. కీరవాణి ఇచ్చిన బిజియం కూడా టీజర్ లోని మాస్ ఎలిమెంట్స్ కి సరిపడే విధంగా ఉంది. నాగార్జున లుంగీ లుక్, లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్న విధానం ఫ్యాన్స్ పండగ చేసుకునే విధంగా ఉన్నాయి. ఓవరాల్ గా టీజర్ చూస్తుంటే చాలా రోజుల తర్వాత నాగార్జున తన ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ ఇవ్వబోతున్నట్లు అర్థం అవుతోంది.