నిప్పు నీరు దోస్తీ చేస్తే.... ఆర్ ఆర్ ఆర్ థీమ్ ని పరిచయం చేసిన దోస్తీ సాంగ్

Published : Aug 01, 2021, 11:50 AM IST
నిప్పు నీరు దోస్తీ చేస్తే.... ఆర్ ఆర్ ఆర్ థీమ్ ని పరిచయం చేసిన దోస్తీ సాంగ్

సారాంశం

ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరు టాప్ స్టార్స్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. నేడు ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకొని దోస్తీ పేరుతో ఓ ప్రమోషనల్ సాంగ్ విడుదల చేశారు. 

సినిమా ఎంత గ్రాండ్ గా తెరక్కిస్తారో.. అంతకు మించి గ్రాండ్ గా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తారు రాజమౌళి. ఆయన సినిమా సక్సెస్ సూత్రంలో ప్రమోషన్స్ కూడా ఒక భాగం. బాహుబలి చిత్రంతో వెయ్యికోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కొత్త మార్కెట్ సూత్రాలు ఇండియన్ సినిమాకు నేర్పాడు ఆయన. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరు టాప్ స్టార్స్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. 


నేడు ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకొని దోస్తీ పేరుతో ఓ ప్రమోషనల్ సాంగ్ విడుదల చేశారు. వివిధ పరిశ్రమలకు చెందిన టాప్ సింగర్స్ ఈ దోస్తీ సాంగ్ లో భాగంగా కాగా తెలుగులో హేమ చంద్ర అద్భుతంగా పాడారు. సాంగ్ లో అనిరుధ్, యాజిన్ నిజార్, విజయ్ ఏసుదాసు, అమిత్ త్రివేది, హేమ చంద్రలతో పాటు ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి సంగీతం సమకూర్చిన ఎం ఎం కీరవాణి కూడా కనిపించారు. ఓ ప్రత్యేకమైన సెట్ లో చిత్రీకరించిన దోస్తీ సాంగ్ ఆకట్టుకుంటుంది. 


ఇక సాంగ్ చివర్లో ఎన్టీఆర్, చరణ్ ఎంట్రీ అదిరిపోయింది. సూట్ ధరించిన ఇద్దరు హీరోలు జెంటిల్ లుక్ లో అదిరిపోయారు. రెండు భిన్న స్వభావాలు కలిగిన ఉద్యమ వీరుల మధ్య దోస్తీ ఎలా ఉంటుందో సాంగ్ లో తెలియజేశారు. స్టార్ రైటర్ సీతారామశాస్త్రి ఆర్ ఆర్ ఆర్ కథలో భీమ్, అల్లూరి మిత్ర బంధాన్ని తెలియజేస్తూ అద్భుతంగా లిరిక్స్ రాశారు. దాదాపు ఐదు నిమిషాలు సాగిన సాంగ్, ఆర్ ఆర్ ఆర్ మూవీ కథ స్వభావాన్ని పరోక్షంగా తెలియజేసింది. ఫ్రెండ్షిప్ డే నాడు ఆర్ ఆర్ ఆర్ నుండి రాజమౌళి ట్రీట్ అదిరింది. 
 

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి