300తో కెరీర్ స్టార్ట్ అయ్యిందంటూ ఎమోషనల్ అయిన కెజియఫ్ స్టార్ యష్

Published : Apr 19, 2022, 01:14 PM IST
300తో కెరీర్ స్టార్ట్ అయ్యిందంటూ ఎమోషనల్ అయిన కెజియఫ్ స్టార్  యష్

సారాంశం

అనూహ్యంగా కెజియఫ్ మూవీ హిట్ అవ్వడం హీరో యష్ కెరీర్ నే మార్చేసంది. ఇప్పుడు కెజియఫ్2 సూపర్ సక్సెస్ ఆయన్ను పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. తనకెరీర్ బిగినింగ్ కష్టాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు యష్.   

అనూహ్యంగా కెజియఫ్ మూవీ హిట్ అవ్వడం హీరో యష్ కెరీర్ నే మార్చేసంది. ఇప్పుడు కెజియఫ్2 సూపర్ సక్సెస్ ఆయన్ను పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. తనకెరీర్ బిగినింగ్ కష్టాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు యష్. 

కేజీఎఫ్ 2 తో సంచలన విజయాన్ని సాధించాడు కన్నడ యండ్ తరంగ్  యష్. ఆ సక్సెస్ ను  ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాలు కొత్త రికార్డులను సృష్టిస్తాయని తాను ఊహించలేదని చెబుతున్నాడు. ఇక రీసెంట్ గా ఓ  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నటుడిగా తన జర్నీ ఎలా మొదలైందనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు యష్.

 కెరీర్ లో తాను అనుభవించిన కష్టాలు,ఇబ్బుందులను తలుచుకున్నారు. తన కెరీర్ గురింరి మాట్లాడుతూ.. మాది చాలా మధ్యతరగతి ఫ్యామిలీ .. మా నాన్న బస్ డ్రైవర్ గా పనిచేసేవారు. నేను సినిమాల్లోకి రావడం ఆయనకి ఎంతమాత్రం ఇష్టం లేదు. సినిమాలు అందరికీ కలిసిరావనేది ఆయన నమ్మకం. అయితే ఆయన నా ఇష్టాన్ని కాదనలేదు. కొంతకాలం ట్రై చేసి .. మనకి సెట్ కావు అనుకుంటే వెనక్కి వచ్చేయమని చెప్పారన్నారు యష్. 

మూవీ కెరీర్ కోసం తాను మొదటి అడుగు వేస్తున్నాప్పునడు.. యష్ జేబులో ఉన్న డబ్బులు 300 రూపాయలు మాత్రమే. అది కూడా తన తండ్రి ఇచ్చినవే.  నా దారిలో నన్ను వెళ్లనిస్తూ ఖర్చుల కోసం 300 నా జేబులో పెట్టారు. ఆడబ్బులు అయిపోయిన తరువాత నేను సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టాను. అక్కడ సంపాదించుకున్న పేరే నన్ను సిల్వర్ స్క్రీన్ కి తీసుకొచ్చింది. అక్కడి నుంచి ఇక్కడి వరకూ రాగలిగాను అంటున్నాడు యష్.  

అంతే కాదు ఈ సక్సెస్ నా అభిమానులదీ, నాకు అవకాశం ఇచ్చిన వారందరిదన్నారు యష్. కెజియఫ్ ఛాప్టర్ 2 రిలీజ్ అయ్య దూసుకుపోతుంది. అన్ని భాషల్లో ప్రభంజనం సృష్టిస్తుంది సినిమా. హిందీలో ఐదు రోజుల్లోనే 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది మూవీ. కన్నడ నాట నుంచి యష్ ను పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టిందీ మూవీ. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ