రోడ్ సైడ్ కిరాణా షాప్ లో పాన్ ఇండియా స్టార్, భార్య కోసం యష్ ఏం కొన్నాడో తెలుసా..?

Published : Feb 18, 2024, 07:35 AM ISTUpdated : Feb 18, 2024, 07:39 AM IST
రోడ్ సైడ్ కిరాణా షాప్ లో పాన్ ఇండియా స్టార్, భార్య కోసం యష్ ఏం కొన్నాడో తెలుసా..?

సారాంశం

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటారు కదా.. ఆ ఫార్ములా బాగా తెలిసి, దాన్ని బాగా ఫాలో అయ్యే  స్టార్ ఎవరైనా ఉన్నారంటే కెజియఫ్ హీరో యష్ మాత్రమే. ఇంతకీ ఆయన అంతగా ఏం చేశారనే కదా అనుమానం..?   

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గలో తెలిసిన వాడు గొప్పవాడు.. అని పవర్ స్టార్ సినిమాలో డైలాగ్ గుర్తుుండి ఉంటుంది. అదిగో ఆ డైలాగ్ కు బాగా సూట్ అయ్యే హీరో కన్నడ రాక్ స్టార్ యష్. ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ గా ఉన్నా.. తన ఫ్యామిలీ కోసం..ఫ్యాన్స్ కోసం ఎన్ని మెట్లు అయినా దిగి వస్తాడు. మధ్యతరగి నుంచి వచ్చిన ఈ హీరో.. తన జీవితాన్ని మర్చిపోలేదు. అందుకే తన భార్య కోసం రెండు మెట్లు ఎక్కువే దిగి వచ్చాడు. సాధారణ జనంలోకలిసి పోయి.. ఆమె కోరిక తీర్చాడు. 

తన భార్య కోసం, కూతురి కోసం కారు దిగిన యశ్.. రోడ్డు పక్కన ఉన్న ఓ షాప్‌లో క్యాండీ కొని తన భార్యతో పాటు.. గారాల పట్టీకి అందిచ్చాడు. ఇటీవలే తన భార్య, ప్రముఖ నటి రాధిక పండిట్, కూతురు ఐరాతో కలిసి కర్ణాటకలోని భత్కల్ జిల్లా షిరాలీలో ఉన్న ప్రసిద్ధ చిత్రపూర్ మఠాన్ని యశ్ సందర్శించాడు. యశ్ క్యాండీ కొనుగోలు చేస్తుండగా అతడి భార్య రాధిక దుకాణం ముందు ఉన్న బెంచీపై కూర్చొని భర్త వైపు చూస్తూ ఈ ఫొటోలో కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

మరోవైపు యశ్ తన కుటుంబంతో కలిసి చిత్రపూర్ మఠాన్ని సందర్శించేందుకు వచ్చాడని తెలిసి పరిసర ప్రాంతాల్లోని అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. సెల్ఫీలు, ఫోటోల ఎగబడ్డారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు ఫ్యాన్స్‌ను నియంత్రించారు. కాగా స్టార్‌డమ్‌కు దూరంగా సాధారణ జీవితాన్ని ఇష్టపడతాడని యశ్‌కు మంచి పేరుంది. పెద్ద సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడానికి ఇది కూడా ఒక కారణంగా ఉంది. యశ్ అతి సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చి స్టార్‌గా ఎదిగాడు. 

సీరియల్స్‌ యాక్టింగ్ కెరియర్ మొదలుపెట్టి సినీ పరిశ్రమలో సూపర్‌ స్టార్‌గా మారాడు. యశ్ తండ్రి బస్సు డ్రైవర్ అనే విషయం తెలిసిందే. కాగా యశ్ ప్రస్తుతం తన తదుపరి సినిమా ‘టాక్సిక్’ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా అతడి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..