కె.జి.యఫ్ నటుడు కన్నుమూత, షాక్ లో కన్నడ పరిశ్రమ, యష్ తో పాటు పలువురి సంతాపం

By Mahesh JujjuriFirst Published Dec 7, 2022, 10:24 PM IST
Highlights

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఏడాది చాలా మంద ఆర్టిస్ట్ లు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. తాజాగా కన్నడ నటుడు .. కేజియఫ్ ఫేమ్ యాక్టర్  కన్నుమూశారు. 

కేజియఫ్ సినిమాతో బాగా ఫేమస్ అయిన కన్నడ నటుడు కృష్ణ జీ రావు కన్ను మూశారు. ఉపిరి తిత్తుల సమస్యలతో పాటు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ77 ఏళ్ల వయస్సులో ఆయన కన్ను మూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యతో పాటు ఈ వయస్సులో..వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణ జీ రావు.. ట్రీట్మెంట్ తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఆర్ధిక సమస్యల వల్ల ట్రీట్మెంట్ కష్టం అవ్వడంతో...కొంత మంది సన్నిహితులు ఆయన్సు హాస్పిటల్ లో చేర్పించారు. 

అయితే ట్రీట్మెంట్ ఇస్తుండగానే.. శరీరం సహకరించకపోవడంతో కృష్ణ కన్ను మూశారు. ఆయన మరణంతో కన్నడ పరిశ్రమలో విషాదం నెలకొంది. కృష్ణ రావు మరణంతో కన్నడ ప్రముఖులు దిగ్బ్రాంతికి గురైయ్యారు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు ఆయనకుసంతాపం తెలిపారు. హీరో యష్ కూడా కృష్ణ జీ రావు మరణం పట్ట దిగ్బ్రాంతి వ్యాక్తం చేసినట్టు సమాచారం. 


కొన్ని పెద్ద సినిమాల వల్ల .. కొంత మంది జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా ఫేమస్ నటులుగా మారిపోయారు. టాలీవుడ్ లో వేదం వెంకయ్య తాత. మహర్షి తాత ఇలా కొంత మంది బాగా పాపులర్ అయ్యి అవకాశాలు పొందరు. ఆకోవలేనే కన్నడా సినిమా కే.జి.ఎఫ్ సిరీస్ తో బాగా పాపులర్ అయిన నటుడు కృష్ణ జీ రావు. కెజియఫ్ సినిమాత్ ఈయన బాగా పాపులర్ అయ్యాడు.  కన్నడ రూపు రేఖల్ని మార్చేసిన ఈ  సినిమాతో చాలా మంది క్రేజ్ సాధించారు. కొంత మంది అయితే.. టాలీవుడ్  సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. 

ఇదిలా ఉండగా.. కే.జి.ఎఫ్ లో హీరోకి ఎక్కువ ఎలివేషన్స్ రావడానికి కారణమైన పాత్రలో కనిపించిన యాక్టర్  మాత్రం కృష్ణ జి రావు అనే చెప్పాలి. ఈయన కే.జి.ఎఫ్ లో తాత పాత్రను పోషించాడు. సినిమా సూపర్ హిట్ అయ్యాక కే.జి.ఎఫ్ తాత గా ఇతను బాగా పాపులర్ అయిపోయాడు. ఈ సినిమా వల్ల.. ఈ తాత లీడ్ క్యారెక్టర్ లో కన్నడాలో ఓ సీనిమా కూడా రూపొందింది. కాని  ఆర్దికంగా మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు. 

click me!