నానిని పక్కన పెట్టేసింది.. కారణమేమై ఉంటుందో..?

Published : Nov 22, 2018, 10:41 AM IST
నానిని పక్కన పెట్టేసింది.. కారణమేమై ఉంటుందో..?

సారాంశం

'మహానటి' సినిమాతో సౌత్ లో స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరిపోయింది కీర్తి సురేష్. ఈ సినిమా తరువాత ఆమె తన కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. 'మహానటి' తరువాత ఇప్పటివరకు ఆమె 'సామి2', 'పందెంకోడి2', 'సర్కార్' సినిమాలలో నటించింది. మూడు కూడా తమిళ సినిమాలే.. 

ప్రస్తుతం చాలా మంది దర్శకనిర్మాతలు ఆమె డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కీర్తి సురేష్ కి చాలా కథలు కూడా వినిపించారు. కానీ ఈ బ్యూటీ ఏ సినిమా కమిట్ అవ్వలేదు. రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని నటించనున్న ఓ సినిమాలో హీరోయిన్ గా కీర్తిని తీసుకోవాలని అనుకున్నారు.

చంద్రశేఖర్ ఏలేటి ఈ సినిమా దర్శకుడు. 'నేను లోకల్' పెయిర్ ని రిపీట్ చేయాలనుకున్న ఈ దర్శకుడికి కీర్తి సురేష్ నుండి షాక్ తగిలింది. కథ నచ్చినప్పటికీ ఇప్పట్లో ఈ సినిమా చేయలేనని చెప్పేసిందట.

వచ్చిన కథలన్నీ రిజక్ట్ చేస్తూ ఉండడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆరా తీయగా.. ఆమెకి రాజమౌళి 'RRR' లో నటించే అవకాశం వచ్చిందని, దాని కోసం బల్క్ డేట్స్ కేటాయించాల్సిఉండడంతో కీర్తి సురేష్ ఏ సినిమాకి సైన్ చేయడం లేదని అంటున్నారు. రాజమౌళి సినిమాలో ఛాన్స్ వస్తే ఓకే.. లేదంటే వచ్చిన మంచి అవకాశాలు వదులుకున్నట్లవుతుంది!

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: సౌందర్య సినిమా చూసి చేతులు కాల్చుకున్న చిరంజీవి, ఇదెక్కడి గొడవరా అని తలపట్టుకున్న డైరెక్టర్
హృతిక్ రోషన్ 'క్రిష్' సినిమాలో ధోని భార్య నటించిందా?