స్టార్ డైరెక్టర్ భార్యతో కలిసి.... జవాన్ పాటకు స్టెప్పులేసిన కీర్తి సురేష్, వైరల్ వీడియో..

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh)డాన్స్ పర్ఫామెన్స్ తో.. అదరగొట్టింది. స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి జవాన్ సినిమాలో పాటకు స్టెప్పులేసింది ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. 

Keerthy Suresh Dancing Jawan Chaleya Song with Director Atlee wife JMS

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh)డాన్స్ పర్ఫామెన్స్ తో.. అదరగొట్టింది. స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి జవాన్ సినిమాలో పాటకు స్టెప్పులేసింది ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. 

నాలుగేళ్ గ్యాప్ తరువాత గోడకు కొట్టిన బంతిలా అదే ఫోర్స్ తో తిరిగోచ్చాడు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌. ఆయన  నటించిన‌ తాజా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జవాన్‌. తమిళ దర్శకుడు అట్లీ (Atlee) తెరకెక్కిన సినిమా ఈనెల  7న రిలీజ్ అయ్యి.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి.. బాక్సాఫీస్ ను శేక్ చేస్తోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయ్యి వారం రోజులు అవుతుండగా.. ఈ వారం రోజుల్లోనే.. పాన్ ఇండియా మూవీ 650 కోట్లు కొల్లగొట్టింది. 

Latest Videos

 ఈ మూవీలో పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అదులో ముఖ్యంగా  చలేయా అనే సాంగ్ చాలా పెద్ద హిట్టయింది. రొమాంటిక్ మెలోడిగా వచ్చిన ఈ సాంగ్ ప్రపంచ‌వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందింది. ఈ పాటకు సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వదరకూ అందరూ స్టెప్పులేస్తున్నారు.  ఈ పాట‌కు స్టెప్పులేసిన వీడియోల‌ను ప‌లువురు సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్త సురేష్ కూడా ఈ సాంగ్ కు అదరిపోయే స్టెప్పులేసింది. 

కీర్తి సురేష్ తో పాటు తమిళ స్టార్ డైరెక్టర్.. జవాన్ ను డైరెక్ట్ చేసిన  అట్లీ  సతీమణి ప్రియ మోహ‌న్ (Priya Mohan) కూడా కీర్తి సురేష్ తో కలిసి కాలు కదిపారు.  కీర్తి సురేష్‌కు అట్లీ  ఫ్యామిలీకి మొద‌టి నుంచి మంచి రిలేషన్ ఉంది. జవాన్‌ విడుద‌ల‌కు ముందు కూడా కీర్తి సురేష్, అట్లీ, ప్రియ క‌లిసి దిగిన ఫొటోలు నెట్టింట్లో సంద‌డి చేశాయి. తాజాగా ‘జవాన్‌’ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డంతో కీర్తి సురేష్, ప్రియ క‌లిసి ‘చలేయా’ అనే సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. 

ఇక ఈ డ్యాన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో అట్లీ త‌న పెట్‌తో క‌నిపించాడు. ఇక కీర్తి సురేష్, ప్రియ క్రేజీ స్టెప్స్‌తో అదరగొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ వీడియోలు చూసి రకరకాలుగా స్పందిస్తున్నారు. 


 

vuukle one pixel image
click me!