నా జీవితాన్నే మార్చేశారు...కీర్తి సురేష్ ఎమోషనల్ ట్వీట్!

Published : Dec 06, 2018, 06:19 PM ISTUpdated : Dec 06, 2018, 06:20 PM IST
నా జీవితాన్నే మార్చేశారు...కీర్తి సురేష్ ఎమోషనల్ ట్వీట్!

సారాంశం

సరిగ్గా 85 ఏళ్ల క్రితం జన్మించిన అభినయ అందం మహానటి సావిత్రి. కెరీర్ ఆరంభంలోనే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ది బెస్ట్ మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె మంచి మనసున్న నటిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.

సరిగ్గా 85 ఏళ్ల క్రితం జన్మించిన అభినయ అందం మహానటి సావిత్రి. కెరీర్ ఆరంభంలోనే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ది బెస్ట్ మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె మంచి మనసున్న నటిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక నేడు ఆమె పుట్టినరోజు కావడంతో అభిమానులు ఆ తల్లిను తలచుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఇక మహానటి సినిమాతో సావిత్రిని అభిమానులకు మరింత గుర్తు చేసిన చిత్ర యూనిట్ పై కూడా నెటిజన్స్ ప్రశంసలు అందిస్తున్నారు. ఇక మహానటి సినిమాలో సావిత్రిగా కనిపించిన కీర్తి సురేష్ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. తన కెరీర్ మలుపు తిరగడానికి సావిత్రి పాత్ర ఎంతో ఉందని నా జీవితాన్ని ఎంతోగానో చేంజ్ చేసిన సావిత్రి గారిని మర్చిపోలేను అని పేర్కొన్నారు. 

19933 డిసెంబర్ 6న జన్మించిన సావిత్రి 30 ఏళ్ల సినీ కెరీర్ లో 252 సినిమాల్లో నటించారు. 1950-60లలో ఆమె ఇండియాలో ఎక్కువ ఆదరణ కలిగిన లీడింగ్ యాక్టర్ గా వెలుగొందారు. చివరికి 45 ఏళ్ల వయసులో 1981 డిసెంబర్ 26న ఆమె కోమాలోనే తుది శ్వాసను విడిచారు. 

PREV
click me!

Recommended Stories

Krishna కి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా? జయప్రద, శ్రీదేవి కాకుండా సూపర్ స్టార్ ఫేవరెట్ స్టార్ ఎవరు?
Samantha: ఫస్ట్ నైట్‌ సీన్లు సమంత నేర్పించింది.. హీరోయిన్‌ ఓపెన్‌