అమితాబ్ ‌పై ఎఫ్‌ఐఆర్‌..హిందువుల మనోభావాలు దెబ్బ తీసారని

By Surya PrakashFirst Published Nov 3, 2020, 11:39 AM IST
Highlights

 తాజాగా కౌన్‌ బనేగా కరోడ్‌ పతీ’ సీజన్‌ 12  మరో వివాదంలో చిక్కుకుంది. షో హోస్ట్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. గత శుక్రవారపు కరమ్‌ వీర్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌ సందర్భంగా అడిగిన ఓ ప్రశ్న ఇందుకు కారణమైంది. 

కౌన్‌ బనేగా కరోడ్‌ పతీ షోకి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలోనూ అనేకసార్లు ఈ షోపై పలు ఫిర్యాదు వచ్చాయ్. వాటిని దాటుకుంటూ షోని ముందుకు తీసుకుపోతున్నారు. తాజాగా కౌన్‌ బనేగా కరోడ్‌ పతీ’ సీజన్‌ 12  మరో వివాదంలో చిక్కుకుంది. షో హోస్ట్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. గత శుక్రవారపు కరమ్‌ వీర్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌ సందర్భంగా అడిగిన ఓ ప్రశ్న ఇందుకు కారణమైంది. సామాజిక వేత్త బెజవాడ విల్సన్‌, నటుడు అనూప్‌ సోనీలను.. 6,40,000 ప్రశ్నను అడిగారు. ( రూ. కోటి ప్రశ్నకు సమాధానం తెలుసా?)

డిసెంబర్‌ 25, 1927న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆయన అనుచరులు ఏ గ్రంథ ప్రతులను తగులబెట్టారు’’ 
ఏ) విష్ణు పురాణ బి) భగవద్గీత సీ) రిగ్వేద డి) మనుస్మృతి0

 

అయితే ప్రశ్న హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందంటూ లక్నోకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బిగ్‌బీతో పాటు షో నిర్వహకులపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 

అమితాబ్ ఆ మధ్యన ముంబైలోని లీలావ‌తి హాస్పిట‌ల్‌లో చికిత్స పొంది పూర్తిగా కోవిడ్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. కాగా అమితాబ్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు.  ఈ క్రమంలోనే త్వరలో 'కౌన్ బనేగా కరోడ్ పతి ' గేమ్ షో షూటింగ్ ను ప్రారంభించారు. అత్యంత భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు తీసుకుంటూ కేబీసీ షోను తిరిగి ప్రారంభించామని స్వ‌యంగా అమితాబ్ వెల్ల‌డించారు. అయితే కొంతమంది ఈ సమయంలో అవసరమా అంటూ చేసిన వ్యాఖ్యలపై బిగ్ బి స్పందిస్తూ ... ‘స‌మ‌స్య వ‌చ్చింద‌ని అక్క‌డే ఆగిపోతామా? జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. అన్ని జాగ్రత్త‌ల‌తో 2 రోజుల షెడ్యూల్‌ను ఒక్క‌రోజులోనే పూర్త‌య్యేలా ప్లాన్ చేసాం’ అని అమితాబ్ పేర్కొన్నారు.

click me!