'బిగ్ బాస్ 3' కాంట్రవర్శీ.. కౌశల్ ఏమంటున్నాడంటే..?

Published : Jul 18, 2019, 02:03 PM IST
'బిగ్ బాస్ 3' కాంట్రవర్శీ.. కౌశల్ ఏమంటున్నాడంటే..?

సారాంశం

*బిగ్ బాస్ సీజన్ 3 పై వస్తోన్న ఆరోపణలపై కౌశల్ పరోక్షంగా రియాక్ట్ అయ్యాడు.  *బిగ్ బాస్ షో సెలెక్షన్ ప్రాసెస్ అంతా జెన్యూన్ గా ఉంటుందని చెప్పారు. 

బిగ్ బాస్ రియాలిటీ షోపై గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే.. కొందరు నటీమణులు బిగ్ బాస్ షో ఎంపిక ప్రక్రియలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ షోని నిలిపివేయాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి వంటి నిర్మాతలు పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కార్యక్రమ నిర్వాహకుడు అభిషేక్ ముఖర్జీపై సినీ నటి గాయత్రి గుప్తా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ షో వాయిదా పడుతుందనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ 2 విజేత కౌశల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

బిగ్ బాస్ 2 విజేతగా, ఓ సామాన్య పౌరుడిగా ఈ షోపై తనకు ఎంతో గౌరవం ఉందని, ఈ కార్యక్రమం ఎంపిక చేసే ప్రాసెస్ ఎంతో నిజాయితీగా ఉంటుందని చెప్పారు. బిగ్ బాస్ మూడో సీజన్ లో పాల్గొనబోయేవారికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

'ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. మీరు రైడ్ ఎక్కబోతున్నారు' అంటూ బిగ్ బాస్ 3 కంటెస్టంట్స్ కి చెప్పాడు. ఈ షోకి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ వారంలోనే షో మొదలుకావాల్సివుంది. కానీ వాయిదా పడే ఛాన్స్ ఉందని టాక్. 

PREV
click me!

Recommended Stories

Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Priyanka Singh: బతుకుతానో లేదో తెలియదు, అద్ధంలో ముఖం చూసుకుంటే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రియాంక సింగ్ ఎమోషనల్ కామెంట్స్