కట్టప్పకి రోజుకి రూ.10 లక్షలు!

Published : Nov 10, 2018, 12:40 PM IST
కట్టప్పకి రోజుకి రూ.10 లక్షలు!

సారాంశం

'మిర్చి' సినిమా హిట్ కావడంతో తమిళ నటుడు సత్యరాజ్ కి టాలీవుడ్ లో ఆదరణ పెరిగింది. ఆ తరువాత తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకున్నాడు. ఎప్పుడైతే బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రలో నటించాడో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. 

'మిర్చి' సినిమా హిట్ కావడంతో తమిళ నటుడు సత్యరాజ్ కి టాలీవుడ్ లో ఆదరణ పెరిగింది. ఆ తరువాత తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకున్నాడు. ఎప్పుడైతే బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రలో నటించాడో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర కీలకం. ప్రభాస్, రానాలతో సమానంగా కట్టప్ప పాత్రకి ప్రాధాన్యతనిచ్చారు. దీంతో అతడికి పాపులారిటీ, డిమాండ్ బాగా పెరిగాయి. ఇప్పటివరకు తమిళంలో ప్రకాష్ రాజ్ మాత్రమే రోజుకి 6 నుండి 7 లక్షల రూపాయలు తీసుకునే సీనియర్ నటుడు.

ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో సత్యరాజ్.. ప్రకాష్ రాజ్ ని మించిపోయాడు. రోజుకి రూ.10 లక్షలు రెమ్యునరేషన్ గా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరోలు, హీరోయిన్ల తండ్రి పాత్రల కోసం ఈ రేంజ్ లో మొత్తాన్ని ఇవ్వడం నిర్మాతలకు కష్టమే..

కానీ సత్యరాజ్ కి ఉన్న క్రేజ్ తో ఆయన అడిగినంత మొత్తాన్ని ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. తెలుగులో కూడా ఆయన ఇదే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది!

PREV
click me!

Recommended Stories

Devara: దేవర కలెక్షన్స్ నిజమా ఫేకా, దుబాయ్ లో సక్సెస్ పార్టీ ఎందుకు చేశారు ? అసలు గుట్టు బయటపడింది
Chennai Love Story Collections: బాక్సాఫీసు వద్ద కిరణ్‌ అబ్బవరం రచ్చ.. చెన్నై లవ్‌ స్టోరీకి మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లు