మహేష్ సినిమాకి నో చెప్పిన బాలీవుడ్ బ్యూటీ!

Published : Jan 31, 2019, 04:57 PM IST
మహేష్ సినిమాకి నో చెప్పిన బాలీవుడ్ బ్యూటీ!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించాలని ఎవరికీ మాత్రం ఉండదు. బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా ఈ సౌత్ స్టార్ హిరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇటీవల కత్రిన కైఫ్ కు అలాంటి ఆఫరే వస్తే అమ్మడు నటించనని చెప్పినట్లు టాక్ వచ్చింది

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించాలని ఎవరికీ మాత్రం ఉండదు. బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా ఈ సౌత్ స్టార్ హిరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇటీవల కత్రిన కైఫ్ కు అలాంటి ఆఫరే వస్తే అమ్మడు నటించనని చెప్పినట్లు టాక్ వచ్చింది. మహేష్ తో నటించడం ఇష్టం లేదని కత్రినా చెప్పినట్లు బాలీవుడ్ మీడియాలో కూడా కథనాలు వెలువడ్డాయి. 

అయితే రీసెంట్ గా కత్రినా చెప్పినదాన్ని బట్టి ఈ విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది. అసలు కత్రినా వద్దకు మహేష్ కు సంబందించిన ఎలాంటి ప్రాజెక్టు రాలేదని అర్థమైపోయింది. సుకుమార్ నెక్స్ట్ మహేష్ తో వర్క్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా కోసం కత్రినా కైఫ్ ను అనుకున్నట్లు రీసెంట్ గా టాక్ వచ్చింది. 

ఈ విషయంపై కత్రినాను నేషనల్ మీడియా అడగ్గా.. సల్మాన్ 'భరత్' సినిమా అనంతరం నేను మరో సినిమాకు సైన్ చేయలేదు అని వివరణ ఇచ్చింది. సౌత్ సినిమాలు తన దగ్గరకు రావడంపై కత్రినా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అంటే మహేష్ సినిమా కోసం కత్రినాను అనుకోవడం ఎంతవరకు నిజమో గాని సుక్కు అయితే ఇంకా ఎవరిని కలవలేదని అర్ధమయ్యింది. 

ప్రస్తుతం ఆయన మహేష్ కోసం బౌండ్ స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మహేష్ మహర్షి సినిమా పూర్తవ్వవగానే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సుక్కు - మహేష్ కొత్త సినిమా స్టార్ట్ కానుంది. హీరోయిన్ విషయంలో ఒక క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే