సెన్సేషనల్ ఆర్ ఎక్స్ 100 కాంబినేషన్ మరోసారి కలవబోతోంది. సక్సెస్ కోసం చూస్తున్న హీరో కార్తికేయ, డైరెక్టర్ అజయ్ భూపతి మరోసారి కలిసి సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఆర్ ఎక్స్ 100 మామూలు సినిమా కాదు. అర్జున్ రెడ్డి (Arjun Reddy)తరువాత.. యూత్ ను ఆరేంజ్ లో ఆకట్టుకున్న సినిమా. నిజ జీవితం లో జరిగిన సంఘటను ఆధారంగ చేసుకుని డైరెక్టర్ అజయ్ భూపతి (Ajay Bhupathi)ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. సిక్స్ ఫీట్.. సిక్స్ ప్యాక్ తో కార్తికేయ(Karthikeya) అమ్మాయిల మనసు దోచుకుంటే.. నాజూకు అందాలతో.. వయ్యారాలు పోతూ.. బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్(Payal Raj Puth) కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.
ఈసినిమాలు హీరో, హీరోయిన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హీరో,హీరోయిన్,డైరెక్టర్ అందరూ కొత్తవాళ్లే.. కాని ఈ ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో ముగ్గరూ పాతుకు పోయారు. 2018 లో రిలీజ్ అయిన ఈమూవీ సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాదు. యూత్ లో మంచి క్రేజ్ ను సాధించింది. రొమాంటిక్స్ సీన్స్ తో రచ్చ రచ్చ చేసిన ఈ సినిమా రిలీజ్ అయిన మూడేళ్ళకు మళ్ళీ ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది.
ఇక ఆర్ ఎక్స్ 100 తరువాత అటు డైరెక్టర్ అజయ్ భూపతికి.. ఇటు కార్తికేయకు చెప్పుకోదగ్గ హిట్ లేదు. అజయ్ భూపతి అయితే రెండేళ్ళు సినిమా చేయలేదు. ఆర్ 100 తరువాత రీసెంట్ గా సిద్థార్థ్, శర్వానంద్ తో చేసిన మల్టీ స్టారర్ మహాసముద్రం డిజాస్టర్ అయ్యింది. దాంతో అజయ్ భూపతి మూడో సినిమా.. పక్కా గా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.
అటు కార్తికేయ మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నాడు కాని... ఆర్ ఎక్స్ 100 రేంజ్ హిట్ మాత్రం అందుకోలేక పోయాడు. రీసెంట్ గా వచ్చిన రాజా విక్రమార్క, చావుకబురు చల్లగా లాంటి సినిమాలయితే డిజాస్టర్స్ అయ్యాయి. ఇక ఈ మధ్య నెగెటీవ్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్న కార్తికేయ తమిళ్ లో స్టార్ హీరో అజిత్ కు వాలిమై సినిమాలో స్ట్రాంగ్ విలన్ గా నటించాడు.అంతకు ముందు నానీ గ్యాంగ్ లీడర్ లో కూడా హ్యాండ్సమ్ విలన్ గా మెప్పించాడు. ప్రస్తుతం మనోడి ఆశలన్నీ వాలిమై పైనే ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే తమిళ్ లో దూసుకుపోవచ్చని చూస్తున్నాడు.
Also Read : Samantha Meets Hrithik Roshan: హృతిక్ రోషన్ ను కలిసిన సమంత.. సినిమా చేయబోతున్నారా..?
అటు అజయ్ భూపతి, ఇటు కార్తికేయ సాలిడ్ హిట్ కోసం చూస్తున్నారు. అందుకే వీరిద్దరు కలిసి మళ్ళీ సినిమా చేయాలి అనుకున్నట్టు తెలుస్తోంది. దీని కోసం అజయ్ మంచి కథ కూడా రాస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్ ఎక్స్ 100 అదరగొట్టింది అంటే.. అంతకు మించి తరువాత సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఈసారి రొమాన్స్ పాళ్లు ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉంది. మరి హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ను తీసుకుంటారా..? లేక మరో బోల్డ్ బ్యూటీ ఎవరైనా కార్తికేయతో జతకడుతుందా అనేది తెలియాలి. త్వరలో ఈ క్రేజీ కాంబినేషన్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.